IV therapy benefits: హ్యాంగోవర్ తగ్గించే ఐవీ హైడ్రేషన్ థెరపీ, సెలెబ్రిటీలు ఎందుకు తీసుకుంటారు?-know why arjun kapoor and celebs takes iv hydration therapy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Iv Therapy Benefits: హ్యాంగోవర్ తగ్గించే ఐవీ హైడ్రేషన్ థెరపీ, సెలెబ్రిటీలు ఎందుకు తీసుకుంటారు?

IV therapy benefits: హ్యాంగోవర్ తగ్గించే ఐవీ హైడ్రేషన్ థెరపీ, సెలెబ్రిటీలు ఎందుకు తీసుకుంటారు?

Koutik Pranaya Sree HT Telugu
Aug 06, 2024 07:00 AM IST

IV therapy benefits: అర్జున్ కపూర్ పాత ఫోటో చూసిన ప్రతి అభిమాని ఐవి హైడ్రేషన్ థెరపీ గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ థెరపీ అంటే ఏమిటో, దాని లాభాలేంటో తెల్సుకోండి.

హైడ్రేషన్ థెరపీ లాభాలు
హైడ్రేషన్ థెరపీ లాభాలు

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ మలైకా అరోరాతో బ్రేకప్ వార్తల వల్ల మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి దానికి కారణం వేరే. అర్జున్ కపూర్ చేతికి ఉన్న డ్రిప్ దానికి కారణం. అర్జున్ కపూర్‌కు సంబంధించిన ఓ పాతా ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో, అతని చేతిలో ఐవి డ్రిప్ ఉంది. అభిమానులు ఇది ఇప్పటి ఫోటో అనుకుని ఆందోళన పడ్డారు కూడా. అయితే అర్జున్ కపూర్ ఆ ఫోటోలో తీసుకుంటోంది ఐవీ థెరపీ. ఈ థెరపీ అంటే ఏమిటో, అసలు అది ఎందుకు అవసరమో తెలుసుకుందాం.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంట్రావీనస్(ఐవీ) సూక్ష్మపోషకాలు అందించే చికిత్స. ఇది ఒక విటమిన్ థెరపీ. దీనినే వైద్య భాషలో హైడ్రేషన్ థెరపీ అని కూడా పిలుస్తారు. ఈ థెరపీలో విటమిన్లు, ఖనిజాలు డ్రిప్ సహాయంతో నేరుగా సిరల ద్వారా రక్తంలోకి పంపబడతాయి. తద్వారా ఇది శరీరం అధిక మోతాదులో పోషకాలను గ్రహించగలదు. ఈ చికిత్స ద్వారా విటమిన్లు, ఖనిజాలు సప్లిమెంట్ల కంటే శరీరంలో వేగంగా శోషణ చెందుతాయి. ఈ థెరపీ ప్రభావం శరీరంపై వెంటనే మొదలవుతుంది. జీర్ణ మరియు శ్వాసకోశ సమస్యలలో ఈ చికిత్స చాలా ప్రభావవంతంగా పరిగణిస్తారు.

IV హైడ్రేషన్ థెరపీ ఎందుకు తీసుకుంటారు:

IV హైడ్రేషన్ థెరపీ వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చికిత్స రోగనిరోధక శక్తిని పెంచడానికి, హ్యాంగోవర్లను తగ్గించడానికి, బరువు తగ్గడానికి మరియు వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతే కాదు, చాలా మంది సెలబ్రిటీలు చర్మాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచడానికి, యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉండటానికి ఐవి హైడ్రేషన్ థెరపీని తీసుకుంటారు. సాధారణంగా, శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని తొలగించడానికి వైద్యులు ఈ చికిత్సను ఇస్తారు. ఒక వ్యక్తికి మందులు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, ఐవి థెరపీ ఇవ్వవచ్చు.

హైడ్రేషన్ థెరపీ పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు -

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీర్ణ మరియు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ చికిత్స చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

హైడ్రేషన్ థెరపీ తీసుకోవడం ద్వారా స్థూలకాయమే కాదు, శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని అధిగమించవచ్చు.

ఈ చికిత్స రోగనిరోధక శక్తిని పెంచడానికి, హ్యాంగోవర్లను తగ్గించడానికి, బరువు తగ్గడానికి మరియు వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

నివేదికల ప్రకారం, ఈ చికిత్స ఖర్చు 25000 నుండి 30000 వేల రూపాయల వరకు ఉంటుంది. విటమిన్ బి, విటమిన్ సి, మినరల్స్ అధిక మోతాదులో ఈ చికిత్స ద్వారా ఇస్తారు.