ఫన్ నైట్ హ్యాంగోవర్ తగ్గించే 5 ఆల్కహాల్ డిటాక్స్ డ్రింక్స్ ఇవే
pexels
By Bandaru Satyaprasad May 14, 2024
Hindustan Times Telugu
సూపర్ ఫన్ నైట్ పార్టీలో కాస్త ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే... మరునాడు హ్యాంగోవర్ తో భారంగా ఉంటుంది. అయితే ఆల్కహాల్ డిటాక్స్ డింక్స్ తో మళ్లీ రోజును ఉత్తేజంగా మార్చుకోవచ్చు.
pexels
అల్లం టీ - అల్లం యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఆల్కహాల్ వల్ల కలిగే హ్యాంగోవర్ తగ్గించడంలో సాయపడుతుంది. లివర్ ను డిటాక్స్ చేసేందుకు అల్లం టీలో కాస్త పసుపు, నల్ల మిరియాలు కలిపి తాగండి.
pexels
లెమన్ వాటర్ - నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్స్, ఆల్కలైజింగ్ ఎఫెక్ట్ మీ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఆల్కహాల్ డిటాక్స్ చేసి pH బెలెన్స్ ను పునరుద్దరించడంలో సాయపడుతుంది.
pexels
బీట్ రూట్ జూస్ - బీట్ రూట్ ఆల్కహాల్ ఉత్పత్తులను తొలిగించి లివర్ ను డిటాక్సిఫికేషన్ చేసేందుకు సహాయపడుతుంది. హ్యాంగోవర్ తగ్గిస్తుంది. శరీరంలో రక్తప్రవాహాన్ని, ఆక్సిజన్ డెలివరీని పెంచుతుంది. తలనొప్పి, అలసటను తగ్గిస్తుంది.
pexels
కీరా దోస పుదీనా వాటర్ - ఒక గ్లాస్ నీటిలో కీరా దోస ముక్కలు, పుదీనా కలిపి రిఫ్రెష్ డ్రింక్ చేయండి. ఇది డిటాక్స్ ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మీ శరీరాన్ని రిఫ్రెష్ చేయడంత పాటు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.
కొబ్బరి నీళ్లు
pexels
కొబ్బరి నీళ్లు శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి అందిస్తుంది. దీంతో హైడ్రేషన్ లెవల్స్ మెరుగుపడతాయి. ఇందులో నాచురల్ షుగర్ అలసటను తగ్గిస్తుంది.
pexels
వేరుశనగలతో బరువు తగ్గింపు...! ఈ విషయాలను తెలుసుకోండి