Light Therapy: లైట్ థెరపీతో మీకంతా ఆనందమే, ఆ థెరపీ ఇలా తీసుకోండి
- Light Therapy: ఆనందంగా ఉండాలంటే శరీరంలో సెరోటోనిన్ విడుదల అవ్వాలి. ఈ హార్మోన్ విడుదలైతేనే మంచి నిద్రపడుతుంది. ప్రశాంతంగా జీవించగలుగుతారు. లైట్ థెరపీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.
- Light Therapy: ఆనందంగా ఉండాలంటే శరీరంలో సెరోటోనిన్ విడుదల అవ్వాలి. ఈ హార్మోన్ విడుదలైతేనే మంచి నిద్రపడుతుంది. ప్రశాంతంగా జీవించగలుగుతారు. లైట్ థెరపీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.
(1 / 6)
లైట్ థెరపీ మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. సూర్యుని నుంచే వచ్చే కాంతి శరీరానికి అత్యవసరమైనది. కానీ తక్కువ మంది మాత్రమే సూర్యకాంతికి గురవ్వుతున్నారు. ఈ కాంతి మెదడులో రసాయన మార్పుకు కారణం అవుతుంది. అది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. స్వచ్ఛమైన సూర్యకాంతిలో ఉదయం, సాయంత్రం వేళల్లో నడవడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. (Unsplash)
(2 / 6)
సూర్యుడి నుండి వచ్చే కాంతి లేదా లైట్ థెరపీలో వాడే ప్రత్యేక బల్బుల నుంచి వచ్చే కాంతి … మానసిక స్థితిని సంతోషంగా మారుస్తుంది. ఇది శారీరక ఆరోగ్యం, మొత్తం మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. (Unsplash)
(3 / 6)
స్వచ్ఛమైన కాంతికి గురికావడం వల్ల మెదడు అలెర్ట్ గా, చురుగ్గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని వల్ల మంచి నిద్రకు సహాయపడుతుంది. (Unsplash)
(4 / 6)
మెదడులో విడుదలయ్యే సెరోటోనిన్ మానసిక స్థితిని స్థిరీకరించడంలో సహాయపడుతుంది. కాంతిని కళ్ళ ద్వారా స్వీకరించినప్పుడు అది సెరోటోనిన్ విడుదలకు సహాయపడుతుంది. (Unsplash)
(5 / 6)
కాంతి శరీరంపై పడడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలయ్యేందుకు సహాయపడుతుంది, ఎండార్ఫిన్లు సంతోషంగా ఉండటానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. (Unsplash)
ఇతర గ్యాలరీలు