Curd in Earthen Pot: మట్టి కుండలో పెరుగు వల్ల ఎన్నో ప్రయోజనాలు: వివరాలివే
Curd in Earthen Pot: మట్టి పాత్రలో తయారు చేసిన పెరుగు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ చూడండి.
Curd in Earthen Pot: పెరుగన్నం తిననిదే భోజనం పూర్తయినట్టు కాదని చాలా మంది భావిస్తారు. అందుకే దాదాపు అన్ని ఇళ్లలో పెరుగు కచ్చితంగా ఉండాల్సిందే. అలాగే, పెరుగు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రుచి కూడా చాలా బాగుంటుంది. వేసవి కాలంలో అయితే పెరుగు చాలా ముఖ్యం. మన పూర్వీకులు ఎక్కువగా పెరుగును మట్టి కుండలు/పాత్రల్లోనే తోడుపెట్టేవారు. కుండల్లోనే నిల్వ చేసేవారు. అయితే, ప్రస్తుత కాలం అధిక శాతం మంది స్టీల్, ప్లాస్టిక్ సహా వివిధ మెటీరియల్ గిన్నెలు, గ్లాసుల్లో పెరుగును తయారు చేసుకుంటున్నారు. అయితే మట్టితో తయారు చేసిన కుండ/పాత్రలో తోడు పెట్టిన పెరుగును తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. టేస్ట్ దగ్గరి నుంచి ప్రొబయోటిక్స్ వరకు చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మట్టి కుండలో తయారు చేసే పెరుగు వల్ల కలిగే ప్రధానమైన ప్రయోజనాలు ఇవే.
జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తి మెరుగుదల
Earthen Pot Curd Benefits: మట్టి పాత్రల్లో పెరుగును తయారు చేస్తే అందులో ప్రొబయోటిక్స్ (శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియా) ఎక్కువగా ఉంటాయి. ఇతర మెటీరియల్ పాత్రల్లో చేసిన పెరుగు కంటే మట్టి పాత్రల్లో చేసిన పెరుగులో ఇవి అధికంగా ఉంటాయి. ప్రొబయోటిక్స్ జీర్ణక్రియను, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. మట్టిలో ఉండే పోరస్ స్వభావం లోపల గాలిని ప్రసరించడానికి అనువుగా ఉంటుంది. ఇది పెరుగు కిణ్వ ప్రక్రియకు బాగా సాయపడుతుంది. అలాగే, పెరుగులో ఉండే అదనపు నీటిని మట్టి కుండ పీల్చుకుంటుంది. దీంతో పెరుగు మరింత గట్టిగా ఉంటుంది.
ప్రత్యేకమైన ఫ్లేవర్, రుచి
Curd in Earthen Pot: మట్టిపాత్రలో పెరుగును తయారు చేస్తే.. దానికి ఓ ప్రత్యేకమైన ఫ్లేవర్ ఉంటుంది. పెరుగుకు మట్టి లాంటి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మీరు ఇతర ఏ మెటీరియల్ పాత్రలో పెరుగు తయారు చేసినా ఇలాంటి ఫ్లేవర్ ఉండదు. అందుకే మట్టికుండలో పెరుగు తోడు పెడితే.. అది ప్రత్యేకమైన ఫ్లేవర్, మంచి రుచిగా ఉంటుంది.
ఎక్కువ పోషకాలు
Curd in Earthen Pot: మట్టి కుండలు/పాత్రలు సహజసిద్ధమైన మట్టితో తయారవుతాయి. అందుకే ఇందులో కాల్షియం, మెగ్నిషియం లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి. మట్టి పాత్రల్లో పెరుగు తోడు పెడితే ఆ ఖనిజ లవణాలు పెరుగుకు చేరుతాయి. దీంతో మట్టి కుండలో తయారు చేసిన పెరుగులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ఆల్కలీన్ పదార్థాలు
Curd in Earthen Pot: పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా ఆమ్ల స్వభావం ఉంటుంది. అయితే, మట్టి కుండలో పెరుగు తయారు చేస్తే.. దాంట్లోని ఆమ్లతను సమతుల్యం అవుతుంది. మట్టి కుండలో తయారు చేసే పెరుగులో ఉండే ఆల్కలీన్ సబ్‍స్టిట్యూట్స్ జత అయి.. పెరుగులోని ఆమ్లతను బ్యానెన్స్ చేస్తాయి.
సంబంధిత కథనం