Kidney Beans Health Benefits : మీ డైట్​లో రాజ్మాలు తీసుకోండి.. ఎందుకంటే..-know kidney beans health benefits and its nutritional value ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kidney Beans Health Benefits : మీ డైట్​లో రాజ్మాలు తీసుకోండి.. ఎందుకంటే..

Kidney Beans Health Benefits : మీ డైట్​లో రాజ్మాలు తీసుకోండి.. ఎందుకంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 28, 2022 07:49 PM IST

Kidney Beans Health Benefits : కిడ్నీ ఆకారంలో ఉండే బీన్స్‌ను రాజ్మాలుగా పిలుస్తారు. ఇదొక చిక్కుడు జాతి విత్తనం. ముదురు ఎరుపు, లేత ఎరుపు రంగుల్లో ఉంటాయి. అయితే వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వాటిని కచ్చితంగా మీ డైట్లో చేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు.

రాజ్మాలతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
రాజ్మాలతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Kidney Beans Health Benefits : ఉత్తర భారత దేశంలో రాజ్మా వంటకాలు ఎక్కువగా చేస్తారు. ముఖ్యంగా శాఖాహారులు ప్రోటీన్ కోసం రాజ్మాలను ఎక్కువగా తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. రోజూ ఓ కప్పు రాజ్మాలు తింటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుందంటే అతిశయోక్తి కాదు. శాచ్యురేటెడ్ కొవ్వులు తక్కువగా ఉండడం, తగినంత ఫైబర్, ప్రోటీన్, ఫోలేట్, ఐరన్ ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాజ్మాల్లో ఉండే ఐరన్, మాంగనీస్, ఫోలేట్, ఫాస్ఫరస్, థయామిన్ వంటివన్నీ మీ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలే. అలాగే వీటిలో అనేక బయోయాక్టివ్ మిశ్రమాలు, యాంటాక్సిడెంట్లు ఉంటాయి.

కప్పు రాజ్మాల్లో పోషక విలువలు

* క్యాలరీలు: 105

* ఫైబర్: 7 గ్రాములు

* ప్రోటీన్: 7 గ్రాములు

* కొవ్వు: 1 గ్రాము

* పిండిపదార్థాలు: 19 గ్రాములు

గుండెకు మేలు

ప్రోటీన్ గల ఆహారం తీసుకోవాలంటే మనం ఎక్కువగా మాంసాహారంపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఆయా మాంసాహారాల్లో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ గుండెకు చేటు చేస్తుంది. పైగా వీటిలో కొలెస్ట్రాల్ గానీ, అనారోగ్యకరమైన కొవ్వులు గానీ ఉండవు. ఇవి తగినంత ఫైబర్‌తో పాటు.. ప్రోటీన్ ఇందులో ఉంటుంది. ఈ లెక్కన మాంసాహారానికి బదులు రాజ్మాలు తీసుకంటే మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారవుతారు.

బరువు తగ్గేందుకు..

కిడ్నీ బీన్స్‌ తక్కువ పిండి పదార్థాలు గల ఆహారం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫైబర్ కారణంగా మీ కడుపు నిండుగా అనిపిస్తుంది. జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది. అందువల్ల ఆరోగ్యకరమైన పద్ధతుల్లో బరువు తగ్గాలనుకునే వారు ఎలాంటి నీరసం లేకుండా కిడ్నీ బీన్స్ సాయంతో ఫలితం సాధించవచ్చు.

డయాబెటిస్ పేషెంట్లకు మేలు

రాజ్మాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటి వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా పెరగవు. ఒకవేళ మీరు అధిక గ్లూకోజ్ లెవెల్స్‌ను పెంచే అన్నం తదితర హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు రాజ్మాల కాంబినేషన్ ఉపయోగపడుతుంది.

ఈ జాగ్రత్తలు అవసరం..

రాజ్మాలు బాగా ఉడింకించాలి. లేదంటే మీ జీర్ణక్రియను అవస్తల పాలు చేస్తాయి. తరచుగా కూర రూపంలో తీసుకోని వారు అప్పుడప్పుడు సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు. లేదా పాస్తా, పోహా వంటి రెసిపీల్లో భాగంగా తీసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం