Kitchen Knife Cleaning Tips: వంటగది కత్తిని ఇలా శుభ్రం చేయండి.. మన్నిక పెరుగుతుంది-kitchen knife cleaning tips prolonging the life of your culinary companions ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kitchen Knife Cleaning Tips: వంటగది కత్తిని ఇలా శుభ్రం చేయండి.. మన్నిక పెరుగుతుంది

Kitchen Knife Cleaning Tips: వంటగది కత్తిని ఇలా శుభ్రం చేయండి.. మన్నిక పెరుగుతుంది

HT Telugu Desk HT Telugu
Nov 16, 2023 06:10 PM IST

Kitchen Knife Cleaning Tips: ప్రతి ఒక్కరి వంటగదిలో ఉపయోగించే ముఖ్యమైన వస్తువులలో కత్తులు ఒకటి. ఉపయోగించిన తర్వాత కత్తులను సరిగ్గా శుభ్రపరచడం వల్ల వాటి మన్నిక పెరుగుతుంది. ఎక్కువ రోజులు పదును ఉంటుంది. వంటగది కత్తులను సరిగ్గా ఎలా శుభ్రం చేయాలి?

వంట గదిలో వాడే కత్తిని ఎలా శుభ్ర పరచాలి
వంట గదిలో వాడే కత్తిని ఎలా శుభ్ర పరచాలి

ప్రతి ఒక్కరి వంటగదిలో ఉపయోగించే ముఖ్యమైన వస్తువులలో కత్తులు ఒకటి. వంటగది కత్తిని సరిగ్గా శుభ్రపరచడం దాని మన్నిక, పదును కాపాడడానికి అవసరం. మురికి, తుప్పు పట్టిన కత్తులు మీరు తయారుచేసే ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. సరిగ్గా కడగని కత్తులపై బ్యాక్టీరియా పేరుకుపోయి ఆహారం ద్వారా మీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, అవి మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే కిచెన్ నైఫ్‌ను సరిగ్గా శుభ్రం చేయడం చాలా అవసరం. మీ వంటగది కత్తులను శుభ్రంగా, పదునుగా ఉంచడంలో సహాయపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. 

కత్తిని నీటితో కడగాలి

కత్తిని వంట కోసం ఉపయోగించిన వెంటనే నీటితో కడగాలి. లేదంటే దానిపై ఉండే ఆకుకూరలు, ఉల్లిపాయలు మొదలైన ఆహారపదార్థాలు కత్తిపై ఎండిపోతాయి. కత్తులను శుభ్రపరిచేటప్పుడు ముందు జాగ్రత్త చర్యగా మీరు చేతి తొడుగులు ఉపయోగించవచ్చు. మీరు కత్తి వాడి అలాగే వదిలేస్తే, కాక్రోచ్ వంటి క్రిమి కీటకాలు వచ్చి వాటిపై చేరుతాయి.

డిష్ సోప్ ఉపయోగించండి

ఒక పాత్రలో కొంచెం వెచ్చని నీటిని తీసుకోండి. మీరు వంటలను కడగడానికి ఉపయోగించే డిష్ సోప్ లేదా లిక్విడ్ వాడండి. దానిలో కత్తిని ఉంచి కాసేపు వదిలివేయండి. ఇలా చేయడం వల్ల కత్తిపై ఉన్న మురికి, ఘాటైన వాసన త్వరగా వెళ్లిపోతుంది.

పదునుగా ఉన్న చోట శుభ్రం చేయండి

ఇప్పుడు ఒక మృదువైన స్పాంజిని తీసుకోండి. హ్యాండిల్ నుండి ప్రారంభించి బ్లేడ్ యొక్క కొన వరకు నెమ్మదిగా రుద్దండి. ఇప్పుడు కత్తిపై ఉన్న సబ్బు నీటిని కడగాలి. వాషింగ్ సమయంలో మీ చేతులను తాకకుండా జాగ్రత్త వహించండి. తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడవండి. ఇలా చేయడం వల్ల కత్తి తుప్పు పట్టకుండా ఉంటుంది.

కత్తి ఎక్కడ పెడుతున్నారు?

కిచెన్ సింక్‌లో కత్తులు పెట్టవద్దు. భద్రత దృష్ట్యా ఇది మంచిది కాదు. కత్తిని ఎక్కువసేపు నీటిలో ఉంచితే అది తుప్పు పట్టి చాలా త్వరగా పాడైపోతుంది. కత్తులను శుభ్రమైన గుడ్డతో తుడిచి, శుభ్రం చేసిన వెంటనే వాటిని ఆరబెట్టండి.

డిష్ వాషర్లలో కత్తి పెట్టవద్దు. కత్తులను పాత్ర డ్రాయర్‌లో కాకుండా ప్రత్యేక స్టాండ్‌లో ఉంచండి. ఇది పాత్రలను తీసివేసేటప్పుడు కత్తి గాయాలు నిరోధించవచ్చు. ఇతర విలువైన లేదా అందమైన పాత్రలకు కత్తి గీతలు నివారించవచ్చు. ఇలా కత్తి చాలా కాలం పాటు ఉంటుందో లేదో మీరే చూడండి.

Whats_app_banner