Kitchen Tips: కిచెన్ సింక్ ఎక్కువగా బ్లాక్ అయిపోతోందా? ఇలా చేయండి, దుర్వాసన కూడా రాదు-is the kitchen sink getting clogged a lot do this and you wont even smell bad ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kitchen Tips: కిచెన్ సింక్ ఎక్కువగా బ్లాక్ అయిపోతోందా? ఇలా చేయండి, దుర్వాసన కూడా రాదు

Kitchen Tips: కిచెన్ సింక్ ఎక్కువగా బ్లాక్ అయిపోతోందా? ఇలా చేయండి, దుర్వాసన కూడా రాదు

Haritha Chappa HT Telugu
Jul 17, 2024 09:30 AM IST

Kitchen Tips: కిచెన్ సింక్ బ్లాక్ అయిపోవడం చాలా ఇళ్లల్లో జరుగుతూనే ఉంటుంది. ఇది చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. మీ సింక్ కూడా పదేపదే బ్లాక్ అవుతుంటే, కొన్ని సులభమైన హ్యాక్‌లను చెబుతున్నాము.

కిచెన్ లోని సింక్ క్లీనింగ్
కిచెన్ లోని సింక్ క్లీనింగ్ (Shutterstock)

కిచెన్ సింక్ బ్లాక్ అవ్వడం అనేది చాలా మంది ఇళ్లల్లో ఎదురయ్యే సమస్య. గిన్నెలు తోమినప్పుడు మిగిలే వ్యర్థ పదార్థాలు సింక్ లో ఇరుక్కుని నీరు పోకుండా బ్లాక్ అయిపోతుంది. పాత్రలు శుభ్రం చేసిన తర్వాత ఆహారం ఇరుక్కుపోవడం వల్ల లేదా సింక్ పరిశుభ్రంగా వాష్ చేయకపోవడం పైపులో నాచు పేరుకుపోవడం వంటివి జరుగుతాయి. దీనివల్ల అందులో నుంచి నీరు బయటకు రాదు. మీ కిచెన్ సింక్ కూడా పదేపదే బ్లాక్ అయిపోతూ ఉంటే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సింక్ బ్లాకింగ్ సమస్యను వదిలించుకోవచ్చు. మీ వంటగది సింక్ మెరిసేలా చేసేందుకు, దుర్వాసన రాకుండా చేసుకునేందుకు పాటించాల్సిన చిట్కాలు తెలుసుకోండి.

బేకింగ్ సోడాతో…

బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి వాడితే ఆమ్ల చర్య జరుగుతుంది. ఇది మురికిని తొలగించేందుకు పనిచేస్తుంది. కిచెన్ సింక్ మూసుకుపోయి అందులో చెత్త పేరుకుపోతే శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, వెనిగర్ మిక్స్ చేసి సింక్ రంధ్రంలో వేసి వదిలేయాలి. కొద్ది సేపటికే పైపు లోపల పేరుకుపోయిన చెత్త కరిగిపోవడం మొదలవుతుంది. పదినిమిషాల తర్వాత సింక్ లోపల నీళ్లు పోయాలి. ఇది కరిగిన మురికిని సింక్ నుంచి బయటకు తోసేస్తుంది.

సింక్ లో దుమ్ము, ధూళి, వ్యర్థ పదార్థాలు పేరుకుపోకుండా ముందుగానే చూసుకోవాలి. సింక్ పైపులో పేరుకుపోయిన మురికిని శుభ్రపరచడానికి ఒక తీగను ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక కఠినమైన మెటల్ వైరును తీసుకొని, సింక్ రంధ్రం ద్వారా పైపులో ఉంచండి. ఇప్పుడు తీగను పైకి, కిందకు కదిలించడం ద్వారా పైపులో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల పైపులో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోయి సింక్ నుంచి నీరు సక్రమంగా బయటకు రావడం ప్రారంభమవుతుంది.

నిమ్మకాయ, ఈనోతో…

వంటగది సింక్‌ను శుభ్రం చేయడానికి మీరు నిమ్మకాయ, ఈనోను కూడా ఉపయోగించవచ్చు. ఈనో కూడా ఆమ్లంలాగే పనిచేస్తుంది. దీనిని నిమ్మకాయతో కలిపినప్పుడు ఆమ్ల ప్రతిచర్య ఉంటుంది, ఇది దుమ్ము, జిడ్డును శుభ్రపరుస్తుంది. నిమ్మకాయ, ఈనో మిశ్రమంతో సింక్ ను శుభ్రం చేయడం వల్ల పైపులో పేరుకుపోయిన మురికిని శుభ్రపరచడమే కాకుండా సింక్ లో పేరుకుపోయిన జిడ్డును శుభ్రపరుస్తుంది. ఇది సింక్ ను కొత్తగా, మెరిసేలా చేస్తుంది. మొదట ఈనో పౌడర్ ను ఒక గిన్నెలో వేయండి, ఇప్పుడు దాని పై నిమ్మరసం పిండండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సింక్ లో వేసి స్క్రబ్బర్ సహాయంతో రుద్ది శుభ్రం చేసుకోవాలి. ఇది సింక్ ను పూర్తిగా శుభ్రపరుస్తుంది.

చాలాసార్లు ఆహారం సింక్ లో ఇరుక్కుపోవడం వల్ల చెడు వాసన వస్తుంది. ఉప్పు, నిమ్మకాయల సాయంతో సింక్ వాసనను తొలగించుకోవచ్చు. దీనితో పాటు సింక్ లో కొద్దిగా అడ్డంకి ఏర్పడితే దాన్ని కూడా తొలగించుకోవచ్చు. ఇందుకోసం ఉప్పులో నిమ్మరసం మిక్స్ చేసి సింక్ లో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. దీనికి కొద్దిగా బేకింగ్ సోడా కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని రాత్రంతా సింక్ లో పోసిన తర్వాత ఉదయం నీటితో శుభ్రం చేసిన తర్వాత సింక్ పూర్తిగా శుభ్రపడుతుంది.

Whats_app_banner