మీ పిల్లలకు గోళ్లు కొరికే అలవాటు ఉందా.. అయితే ఇలాంటి చిట్కాలతో మాన్పించండి!
చిన్న పిల్లలకు గోళ్లు కొరికే అలవాటు ఉండటం సాధారణంగా కనిపిస్తుంది. మరి దీన్ని మనిపించాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది పిల్లలకు గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు పిల్లల్లోనే కాదు పెద్దవారిలో కూడా కనిపిస్తుంది. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు. చదివేటప్పుడు. టీవీ చూస్తూ గోళ్లు కొరుకుతుంటారు. ఈ అలవాటు మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ఈ అలవాటు మన ఆరోగ్యంపై ఎలా ప్రభావాన్ని చూపుతుంది. దీని నుండి మనం ఎలా బయటపడగలమో? ఇప్పుడు చూద్దాం.
గోళ్లు కొరకడం ఆపడానికి అనుసరించాల్సిన సులభమైన చిట్కాలు
గోళ్లలో సాధరణంగా మురికి పేరుకుపోతుంది. పిల్లలు నోటితో ఆ గోళ్లు కొరికేస్తే, కడుపులోకి క్రిములు వెళ్ళడం వల్ల అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
పిల్లలు గోర్లు కొరకడం ఆపాలంటే చేతిలకు హానికరం కానీది ఏదైన చేదు పదార్థాన్ని పూయండి. గోళ్లు కొరకకుండా వేప, కాకర రసం వంటివి వేళ్లకు రాయటం వంటివి చేయాలి. వీటిని పిల్లల గోళ్లపై రాయడం వల్ల నోటిలో చేతివేళ్లను పెట్టుకునే అలవాటు క్రమంగా మానుతారు.
పిల్లలు గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించండి. గోళ్లు పెరగకుండా ఉన్నప్పుడు వాటిని కొరికే అలవాటు పోతుంది
పిల్లలు పళ్ళతో తన గోళ్ళను కొరుకుతున్నాడని మీకు అనిపించిన వెంటనే, అతని దృష్టిని మరల్చడానికి ప్రయత్నించండి.
పిల్లలను గోళ్లను కొరుకుటకు ప్రేరేపించే అన్ని ట్రిగ్గర్‌ల నుండి వారిని దూరంగా ఉంచండి.
సంబంధిత కథనం