Chutney For Breakfast : చెట్టినాడ్‌ స్టైల్‌ టమోటా చట్నీ.. ఇడ్లీ, దోసల్లోకి సూపర్‌ కాంబినేషన్‌-how to make chettinad tomato chutney for breakfast in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chutney For Breakfast : చెట్టినాడ్‌ స్టైల్‌ టమోటా చట్నీ.. ఇడ్లీ, దోసల్లోకి సూపర్‌ కాంబినేషన్‌

Chutney For Breakfast : చెట్టినాడ్‌ స్టైల్‌ టమోటా చట్నీ.. ఇడ్లీ, దోసల్లోకి సూపర్‌ కాంబినేషన్‌

Anand Sai HT Telugu
Dec 18, 2023 06:00 AM IST

Tomato Chutney : చెట్టినాడ్ టమోటా చ‌ట్నీ. ఈ పేరు వినే ఉంటారు.. కానీ చట్నీ ఎలా ఉంటుందో ఎప్పుడైనా టేస్ట్‌ చేశారా? ఇడ్లీ, దోస, వడ అన్ని టిఫిన్స్‌లోకి సరిపోతుంది. చెట్టినాడ్ స్టైల్ లో చేసే ఈ టమోటా చ‌ట్నీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చెట్టినాడ్ టమోటా చట్నీ
చెట్టినాడ్ టమోటా చట్నీ

అల్పాహారాల‌తో తిన‌డానికి చెట్టినాడ్‌ టమాటా చట్నీ చాలా చ‌క్కగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వెరైటీ రుచులు కావాల‌నుకునే వారు ఇలా చెట్టినాడ్ ట‌మాట చ‌ట్నీని ట్రై చేయండి. మీ ఫెవరెట్‌ చెట్నీ లిస్ట్‌లో ఇది చేరిపోతుంది. ఒక్కసారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే చ‌ట్నీ కావాలని కోరుకుంటారు. ఎంతో రుచిగా, కారంగా, పుల్లగా ఉండే ఈ చెట్టినాడ్ స్టైల్ టమోటా చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలి చూద్దాం.

చెట్టినాడ్ టమోటా చ‌ట్నీకి ప‌దార్థాలు :

నూనె – 3 టేబుల్ స్పూన్

పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – పెద్దది ఒక‌టి

పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – 10

ఇంగువ – అర టీ స్పూన్

ఉప్పు – త‌గినంత‌,

త‌రిగిన ట‌మాటాలు – 3,

ఎండుమిర్చి – 7

కాశ్మీరి చిల్లీ కారం – ఒక టీ స్పూన్

చింత‌పండు – 2 టీ స్పూన్స్,

నీళ్లు – 2 టేబుల్ స్పూన్స్

బెల్లం – కొద్దిగా.

ఆవాలు – అర టీ స్పూన్,

మిన‌ప‌ప్పు – అర టీ స్పూన్

క‌రివేపాకు – ఒక రెమ్మ

చెట్టినాడ్‌ టమాట చట్నీ ఎలా తయారు చేయాలంటే..

ముందుగా స్టవ్‌ మీద క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ఇంగువ‌, ఉప్పు, ట‌మాట వక్కలు, ఎండుమిర్చి, కారం, చింత‌పండు, నీళ్లు పోసి బాగా క‌ల‌పాలి. మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. ఆ తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు గ్రైండింగ్ చేయకూడదు. త‌రువాత వీటిని జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే బెల్లం కూడా వేసి మెత్తగా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత తాళింపు వేసుకోవాల్సి ఉంటుంది.. క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, మిన‌ప‌ప్పు వేసి వేయించండి. చివర్లో క‌రివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న చట్నీని వేసి క‌ల‌పాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉండే చెట్టినాడ్‌ ట‌మాట చ‌ట్నీ త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ, ఇడ్లీ, దోస వంటి అల్పాహారాల‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

Whats_app_banner