Kidney Day: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి-how to keep your kidneys healthy nephrologist doctor santosh kumar explains ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kidney Day: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

Kidney Day: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 04:49 PM IST

Kidney Day: ముందస్తు జాగ్రత్తలతో కిడ్నీ ఆరోగ్యం సురక్షితంగా ఉంచుకోవచ్చని హైదరాబాద్ కామినేని హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎ.సంతోష్ కుమార్ చెప్పారు. కిడ్నీ డే సందర్భంగా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో ఆయన కిడ్నీ ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

Kidney day 2023: మార్చి 9 కిడ్నీ దినోత్సవం
Kidney day 2023: మార్చి 9 కిడ్నీ దినోత్సవం

మారిన జీవన శైలి, ఆహర విధానాలు, జీవితంలో పెరిగిన వేగం, ఒత్తిడి, పెరుగుతున్న శరీర బరువు అన్ని కూడా పూర్తి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కిడ్నీ వ్యాధిపై అవగాహన లేకపొవడం వల్లే దేశంలో ప్రతిసంవత్సరం దాదాపు 2 లక్షల మంది వ్యాధిగ్రస్తులు మరణిస్తున్నారని నెఫ్రాలజీ వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 9న ప్రపంచ కిడ్నీ డే సంధర్భంగా హైదరాబాద్ కామినేని హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎ.సంతోష్ కుమార్ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

కిడ్నీ వ్యాధితో భాధపడుతున్న వారికి జీవితంపై ఆశలు కలించేందుకు అవగాహన, ఆసరా, భరోసా కల్పించాల్సిన భాధ్యత వైధ్యులతో పాటు ప్రభుత్వాలపై ఉంది. ఈ సంవత్సరం ప్రపంచ కిడ్నీ దినోత్సవం థీమ్ "ఊహించని వాటికి సిద్ధమై, బలహీనులకు మద్దతునివ్వడం!"

ఇది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగులకు సంతృప్తికరమైన, ఉత్పాదక జీవితాన్ని గడపడానికి మద్దతు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. కిడ్నీ మార్పిడి యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం మరియు అవయవ దాతలుగా ఎక్కువ మందిని ప్రోత్సహించడం కూడా ఈ ప్రచారం లక్ష్యం.

శరీరంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు కిడ్నీ మీద కూడా దాని ప్రభావం పడుతుంది. కొవ్వుల జీవ క్రియలో భాగంగా కిడ్నీల మీద కూడా భారం పెరుగుతుంది. శరీరంలో ఏ భాగం సరిగ్గా పనిచేయకపొయిన కిడ్నీలు గుర్తిస్తాయి. ఆ ప్రభావం కచ్చితంగా కిడ్నీల మీద ఉంటుంది. బిపి, షుగర్ స్దాయిలు ఆదుపులో లేకపొయినా చిన్న చిన్న జబ్బులకు యాంటిబయోటిక్ వంటి మందులు వాడినా వాటి ప్రభావం కిడ్నీల మీద తీవ్రంగా ఉంటుంది.

ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా కామినేని హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ‘కిడ్నీ వ్యాధులను మొదటి, రెండో దశలోనే గుర్తించగలిగితే వ్యాధి తీవ్రం కాకుండా నిరోధించటమే కాకుండా ఆపైన పది-పదిహేను సంవత్సరాల వరకూ ఎటుంటి సమస్యలు ఎదురుకాకుండా జాగ్రతలు తీసుకోవటానికి వీలవుతుంది. మా విభాగంలో కిడ్నీ వ్యాధుల చికిత్సతోపాటు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సకు సంబంధించి అత్యాధునిక చికిత్సా పద్దతులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి మూడు, నాలుగు దశల్లో ఉన్నప్పుడు చికిత్స చేయించుకోని పక్షంలో కొందరిలో తీవ్రమైన గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంది. అందువల్ల కనీసం మూడు, నాలుగు దశలలో చికిత్స ప్రారంభించితే హఠాత్తుగా గుండెపోటుకు గురికాకుండా కాపాడుకోవటం, వ్యాధి మరింత ముదరకుండా జాగ్గత్తపడేందుకు వీలవుతుంది..’ అని తెలిపారు.

‘చికిత్స కంటే నిరోధించటమే ఉత్తమం అన్న నియమం కిడ్నీ వ్యాధుల విషయంలో చాలా ముఖ్యమైనది. మూత్రపిండాల పనితీరును దెబ్బదీయటంలో మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం ముందుంటాయి. వీటిని నుంచి కాపాడుకోవటం పరోక్షంగా కిడ్నీ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఈ వ్యాధులకు సంబంధించి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ మందులు వాడుతుండటం ద్వారా వాటి దుష్ప్రభావం మూత్రపిండాలపైన పడకుండా చూసుకోవచ్చు. వారానికి కనీసం అయిదు రోజుల పాటు కనీసం అరగంటపాటు వ్యాయామం చేయటం, కొవ్వు పదార్థాలు తక్కువ, కాయగూరలు, పండ్లు ఎక్కవగా ఉండే ఆహారం తీసుకొంటూ శరీరం బరువు పెరుగకుండా జాగ్రత్త వహించాలి..’ అని డాక్టర్ సంతోష్ కుమార్ వివరించారు.

నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సంతోష్ కుమార్
నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సంతోష్ కుమార్
WhatsApp channel

టాపిక్