Fake Basmati Rice : ఫేక్ బాస్మతి రైస్ ఎలా గుర్తించాలి? వాసన చూసి మోసపోవద్దు
Fake Basmati Rice In Telugu : ఈ మధ్య కాలంలో కల్తీ అనేది చాలా ఎక్కువైంది. తినే వాటిలో అయితే మరీ ఎక్కువగా ఉంది. అలాగే బాస్మతి రైస్‍ను కూడా కొందరు కల్తీ చేసేస్తున్నారు. దీనిని ఎలా గుర్తించాలి?
బాస్మతి బియ్యంతో బిర్యానీ, పులావ్ వంటి వంటకాలు ఎక్కువగా చేస్తారు. బాస్మతితో చేసే బిర్యానీ చూడటానికి, తినడానికి చాలా బాగుంటుంది. అయితే మార్కెట్లో బాస్మతి రైస్(Basmati Rice) కొనే సమయంలో చాల జాగ్రత్తంగా ఉండాలి. ఫేక్ బాస్మతి రైస్‍ను(Fake Bastmati Rice) కొందరు విక్రయిస్తు్న్నారు. వాసన చూసి మోసపోకండి. ఎందుకంటే వాసన వచ్చేందుకు కూడా కొన్ని రకాల ఉత్పత్తులను కలుపుతున్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాలన్నీ కల్తీ అవుతున్నాయి.
ఓ అధ్యయనంలో మార్కెట్‌లలో విక్రయించే బాస్మతిలో 50 శాతం నకిలీ అని తేలింది. 495 బ్రాండ్‌ల బాస్మతి బియ్యం నమూనాలపై ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం 2021-22లో మధ్య చేశారు.
బాస్మతి బియ్యం వండడానికి ముందు, తర్వాత దాని పొడవు, వెడల్పును పరిశోధకులు స్పష్టంగా నిర్వచించారు. ఈ పరీక్షలో చాలా నమూనాలు ఫెయిల్ అయ్యాయని తెలిపారు. నాసిరకం బియ్యంలో బాస్మతిని కలిపి విక్రయదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బాస్మతి బియ్యం వాసనను వెదజల్లే మొక్క రసాన్ని కూడా చల్లుతున్నట్టుగా గుర్తించారు.
అసలైన బాస్మతి బియ్యం ధర ఎక్కువగా ఉండడంతో చాలా మంది విక్రయదారులు ఇతర రకాల బియ్యంతో కలుపుతారు. అందుకే బాస్మతి బియ్యం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
వండడానికి ముందు బాస్మతి బియ్యం పొడవు 6.61 మి.మీ
వండడానికి ముందు బాస్మతి బియ్యం వెడల్పు 2 మిమీ కంటే తక్కువ
వండిన తర్వాత బాస్మతి బియ్యం కనీస వెడల్పు - 3.50 మి.మీ
వండిన బాస్మతి బియ్యం పొడవు - 12 మి.మీ
బాస్మతితో బిర్యానీ, బగారా రైస్ వంటివి చేస్తుంటారు. దీనికి డిమాండ్ ఎక్కువే ఉంది. సాధారణ రైస్, బాస్మతి రైస్ రుచి వేరేగా ఉంటుంది. బాస్మతి బియ్యం పొడవు, సన్నగా ఉంటుంది. రైస్ పై భాగం సూటిగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. బాస్మతి బియ్యం వండినప్పుడు విడిగా ఉంటాయి. అయితే ఉడుకుతుంటే వచ్చే వాసన ఆధారంగా కూడా గుర్తించొచ్చు. గంజి ఎక్కువగా రావడం, వండేప్పుడు సగం ఉడికిన తర్వాత మెతుకు విరిగిపోవడం కారణంగా నాన్ బాస్మతి బియ్యాన్ని(Non Basmati Rice) గుర్తించొచ్చు.
ఎంతో ఇష్టంగా బాస్మతి రైస్ తెచ్చుకుని స్పెషల్ ఐటమ్ చేసుకోవాలి అనుకుంటారు. కానీ నకిలీవి తీసుకొస్తే.. నిరాశే ఎదురవుతుంది. అందుకే దుకాణాల్లోకి వెళ్లినప్పుడు సరిగా వాటిని పరిశీలించి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో కల్తీ అనేది ఎక్కువైపోయింది.