Amla For Hairs : మెంతులు, ఉసిరితో ఇలా ట్రై చేయండి.. మీ జుట్టు రాలదు-home remedies fenugreek seeds and amla to stop hair loss use regularly for hair growth ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Amla For Hairs : మెంతులు, ఉసిరితో ఇలా ట్రై చేయండి.. మీ జుట్టు రాలదు

Amla For Hairs : మెంతులు, ఉసిరితో ఇలా ట్రై చేయండి.. మీ జుట్టు రాలదు

HT Telugu Desk HT Telugu
Apr 03, 2023 03:30 PM IST

Fenugreek and Amla : ఈ కాలంలో జుట్టు సమస్యలు అనేకం ఉన్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ఏవేవో తలకు రాస్తుంటాం. కానీ ఫలితం ఉండదు. ఇంట్లోనే తయారు చేసుకునే వాటితో ప్రయత్నిస్తే ఫలితం ఉండొచ్చు.

జుట్టు సమస్యలు
జుట్టు సమస్యలు (unsplash)

జుట్టు సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడం(Hair Loss), చుండ్రు, జుట్టు పొడిబారడం, తెల్లజుట్టు(White Hair) లాంటి సమస్యలతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటపడేందుకు రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తులను వాడుతున్నారు. దీంతో మరింత సమస్య అవుతుంది. దుష్ప్రభావాలతో ఇబ్బందులు ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటి చిట్కాలను ట్రై చేయండి. ఖర్చు తక్కువే, మీ జుట్టు ఆరోగ్యంగా(Healthy Hair) ఉంటుంది.

జుట్టు సమస్యల(Hair Problems)ను తగ్గించేందుకు ఉసిరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు, ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని(Hair Loss) తగ్గిస్తుంది. ఉసిరికాయను పొడి చేసి.. ఉపయోగిస్తే.. ఫలితాలు చాలా ఉంటాయి. పొడి జుట్టుకు(Dry Hair) కండిషనర్ లాగా వాడుకోవచ్చు. జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలు(Dandruff Problems) కూడా తగ్గుతాయి. అయితే ఉసిరి పొడి(Amla Powder)ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి. ఇందులో మెంతులను కూడా కలుపుకోవాలి.

ఒక గిన్నెలోకి మెంతి(Fenugreek) పొడిని తీసుకోండి. దీనికి సమానంగా ఉసిరికాయ పొడిని తీసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే.. జుట్టు రాలడం తగ్గుతుంది. ఉసిరిపొడితో శీకాకాయ పొడిని కలిపి పేస్ట్ లాగా పెట్టుకుంటే కూడా ఫలితం ఉంటుంది. ఆరిన తర్వాత తలస్నానం(Headbath) చేయాలి. ఇలా చేస్తే.. జుట్టు మృధువుగా తయారు అవుతుంది. జుట్టు సమస్యల తగ్గుతాయి. జుట్టు పొడవుగా పెరుగుతుంది.

అంతేకాదు.. నీటిలో ఉసిరికాయ పొడిని వేసి 5 నిమిషాలు వేడి చేయండి. ఇది చల్లారిన తర్వాత.. నిమ్మరసం(Lemon) వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత తలకు పట్టించాలి. ఆరిన తర్వాత.. రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే.. చుండ్రు సమస్యల నుంచి బయటపడొచ్చు. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు సరిగా ఉండాలంటే పోషకాలు ఉండే ఆహారం తప్పకుండా తీసుకోవాలి.

ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు వస్తాయి. ఈ కారణంగా మీ జుట్టు(Hair)పై ప్రభావం ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను చూస్తారు. క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం మెుదలవుతుంది. ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు(Hair Problems) వస్తాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్