Taapsee Pannu | తాప్సీ రోజుకు ఆరుసార్లు తిన్నా... ఫిట్‌గా ఎలా ఉంటుందంటే..
ఫిట్‌గా ఉండేందుకు నటీనటులు ఆహారాన్ని ఎగ్గొడ్తారు అనుకుంటే అది పొరపాటే. వారు రకరకాల డైట్లు చేస్తారు. అంతే కాకుండా ప్రోటీన్స్ తీసుకుని.. నచ్చినవి తినకుండా కడుపు మాడ్చుకుంటారు అనుకుంటే పొరపాటే. అలా అనుకునేవారు హీరోయిన్ తాప్సీ పన్ను డైట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు.
పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మర్గా పేరుపొందిన హీరోయిన తాప్సీ పన్ను. తెలుగు, తమిళంలోనే కాకుండా.. హిందీలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుని భారీ విజయాలు అందుకుంది ఈ సుందరి. ఆమె నటించిన విభిన్న పాత్రలే వీటికి సాక్ష్యం. ఒక్కో పాత్ర కోసం ఆమె ఫిట్‌గా మారుతూ.. అభిమానులను ఆకట్టుకునే తీరు చూడముచ్చటగా ఉంటుంది. ఇంత ఫిట్‌గా ఉండే తాప్సీ రోజుకు ఆరుసార్లు తింటారంటా. ఏంటి నిజమా అనుకుంటున్నారా? రోజుకు ఆరు సార్లు తింటూ కూడా.. ఆమె ఇంత ఫిట్‌గా ఎలా ఉన్నారో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
ఫుడ్ విషయంలో రాజీపడను
ప్రముఖ పోషకాహార నిపుణులు మున్మున్ షేర్ చేసిన వీడియోలో తాప్సీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.“నేను దిల్లీ సర్దార్ని. నేను ఆ ఆహారాన్నే ఇష్టపడతాను. నేను తినడానికి ఇష్టపడే ఆహారాన్ని నాకు దూరం చేయని.. ఆ విషయాన్ని అర్థం చేసుకునే వ్యక్తిని నేను కోరుకుంటాను. నేను ఇష్టపడనిది ఏమీ తినలేను ”అని తాప్సీ తేల్చి చెప్పేసింది. రష్మీ రాకెట్ కోసం శిక్షణ పొందుతున్నప్పుడు కూడా ఆమె అనుసరించిన మంత్రం ఇదే. ఇందులో ఆమె అథ్లెట్ పాత్రను పోషించింది. అథ్లెట్ పాత్రను పోషించినా.. ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువ కష్టపడ్డాను కానీ నచ్చినవే తిన్నాను అంటుంది.
తాప్సీ తన రాబోయే స్పోర్ట్స్ సాగా శభాష్ మిథు ఫస్ట్ లుక్ ఇటీవలె విడుదలైంది. ఈ చిత్రంలో ఆమె భారత మహిళా జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పాత్రలో కనిపించనుంది. ఈ పోస్టర్‌ను షేర్ చేసిన తాప్సీ.. “ఆమె నాలాంటి మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
తాప్సీ పన్ను డైట్ ప్లాన్
వాస్తవానికి తాప్సీ చేసే పాత్రలు చాలా వరకు ఆమె ఫిట్నెస్ను రివిల్ చేస్తాయి. తాజాగా ఈ సినిమాలో కూడా తాప్సీ ఫిట్నెస్ను ఏ మాత్రం చెదరనివ్వలేదు. మిథాలీ రాజ్ పాత్రకు తగ్గట్లుగా ఆమె తన శరీరాన్ని మార్చుకుంది. కానీ ఆహారం విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడలేదని తాప్సీ తేల్చి చెప్పింది. అథ్లెట్ పాత్రకోసం తను ఎలాంటి డైట్లు చేయలేదని వివరించింది.
నేను రోజుకు 6 సార్లు తింటాను. నా భోజనంలో కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇదే నా డైట్ ప్లాన్ అని వెల్లడించింది.
“మంచి ఆరోగ్యం అంటే సూపర్‌ఫుడ్‌లు, కఠినమైన వ్యాయామాల మాత్రమే కాదని నేను నమ్ముతున్నాను. నిజ జీవితంలోని అనేక పరిస్థితులు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని మున్మన్ వెల్లడించారు. ఆ డోనట్ కోసం వెళ్లాలా వద్దా? తినాలా లేదా? ఈ రోజు తినేసి నేను రేపటి నుంచి వ్యాయామం చేస్తాను అని కంట్రోల్లోనే ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. ఏది ఎప్పుడు ఎంత తినాలనేదానిపై మన ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుందని వెల్లడించారు.
తాప్సీ అన్నం, ఒక గిన్నె పెరుగు, కొన్ని కూరగాయలతో కూడిన శాఖాహారం తింటుందని మున్మున్ తెలిపారు. రాత్రి భోజనం కోసం, ఆమె జోవర్ లేదా బార్లీతో పాటు ఆర్గానిక్ మాంసం, చేపలను తింటారని వెల్లడించారు. తాజాగా తయారు చేసిన.. సాంప్రదాయికమైన ఆహారాన్నే ఆమె తీసుకుంటుందని స్పష్టం చేశారు. కల్చర్డ్ నెయ్యి కాకుండా... నువ్వుల నూనెను ఆహారంలో వినియోగిస్తుందని ఆయన తెలిపారు.