Juice for Skin: మెరిసే చర్మం కావాలా? ఈ జ్యూస్ ప్రతిరోజూ ఒక గ్లాసు తాగండి చాలు
Juice for Skin: చలికాలంలో చాలా మంది డ్రై స్కిన్ సమస్యలను ఎదుర్కొంటారు.రోజూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
చలికాలంలో చాలా మంది పొడి చర్మం సమస్యను ఎదుర్కొంటారు.అలాంటి వారికి దానిమ్మ రసం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీని జ్యూస్ ను ప్రతిరోజూ తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. దానిమ్మ పండులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, ఐరన్‌తో పాటు దానిమ్మలో అనేక ఇతర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ అధికంగా దొరికేది శీతాకాలంలోనే. మన ఆరోగ్యానికి ఒక దానిమ్మ పండు తినడం లేదా దాని రసం తాగాలి. దంతాలు లేని వృద్ధులు, పిల్లలు దానిమ్మ తినడానికి ఇబ్బంది పడుతుంటే వారికి జ్యూస్ రూపంలో ఇవ్వండి. అలా అని మార్కెట్ లో దొరికే జ్యూస్ మాత్రం తాగకండి.
దానిమ్మ జ్యూస్ తయారీ
దానిమ్మ జ్యూస్ తయారు చేయాలంటే ముందుగా దానిమ్మను తొక్క తీసి గింజలను మాత్రమే మిక్సీలో వేయాలి. అయిదు నిమిషాల పాటూ మిక్సీలో వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. అందులో అరకప్పు నీళ్లు వేసి మళ్లీ ఒకసారి మిక్సీ చేయాలి. ఈ మొత్తాన్ని వడకట్టి గ్లాసులో వేయాలి. అంతే తాజా దానిమ్మ జ్యూస్ తయారైనట్టే. హెల్తీ జ్యూస్ తాగడం వల్ల మీ అందం కూడా ఇనుమడిస్తుంది.
మెరిసే చర్మానికి దానిమ్మ జ్యూస్ ప్రయోజనాలు
దానిమ్మ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాలుష్యం, ఒత్తిడి, యూవీ కిరణాలు వల్ల చర్మం దెబ్బతినకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యం, చర్మం ముడతలు, డార్క్ స్పాట్స్ ను దూరం చేస్తాయి.
మాయిశ్చరైజింగ్: దానిమ్మ జ్యూస్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో గాలి పొడిగా ఉండటం వల్ల మృదువైన, మెరిసే చర్మాన్ని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం.
యవ్వనంగా ఉండేందుకు: కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా అవసరం. ఇది చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇది నల్లటి మచ్చలను తొలగించి చర్మానికి మెరుపును ఇస్తుంది. చర్మం మెరిసిపోవడానికి అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి.
రక్త ప్రసరణ: దానిమ్మ రసం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది చర్మ కణాలకు ఆక్సిజన్, అవసరమైన పోషకాలను అందించడంలో కూడా సహాయపడుతుంది. ఇది మొత్తం ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన రంగును పొందడంలో సహాయపడుతుంది.
దానిమ్మ పండు అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీనిని అన్ని వ్యాధులకు ఔషధంగా తీసుకుంటారు. ఇందులో యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. హిమోగ్లోబిన్ లేదా ఐరన్ లోపం తక్కువగా ఉన్నవారికి దానిమ్మ ఒక అద్భుతమైన పండు. ఇది పొట్ట ఆరోగ్యానికి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, అజీర్ణం, మలబద్దకాన్ని మెరుగుపరుస్తుంది. దానిమ్మ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)