Mushroom Benefits : బరువు తగ్గడానికే కాదు.. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయ్-health benefits with mushrooms here is the details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mushroom Benefits : బరువు తగ్గడానికే కాదు.. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయ్

Mushroom Benefits : బరువు తగ్గడానికే కాదు.. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయ్

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 24, 2022 03:59 PM IST

Mushroom Benefits : మష్రూమ్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తీసుకునే ఆహారాల్లో ఒకటి. పైగా దీనిలో చాలా విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని తీసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే వీటివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు ఆహార నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మష్రూమ్ వల్ల ఉపయోగాలు
మష్రూమ్ వల్ల ఉపయోగాలు

Mushroom Benefits : షిటేక్, క్రిమినీ నుంచి ఓస్టెర్, బీచ్ వరకు మష్రూమ్స్ ప్రపంచవ్యాప్తంగా 2000 రకాల్లో అందుబాటులో ఉన్నాయి. అందుకే వీటిని ఒక ప్రసిద్ధ ఆహార పదార్థంగా పిలుస్తారు. పైగా ఇవి పూర్తిగా పోషకాలతో నిండి ఉంటాయి. అయితే వీటిలో ఉండే పోషకాలు.. మీకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి అంటున్నారు. మరి మీరు కూడా ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుని.. మీ డైట్​లో చేర్చుకోండి.

రక్తపోటును తగ్గిస్తుంది..

మష్రూమ్స్​లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో అదనపు సోడియం ప్రభావాలను తిరస్కరించేలా చేస్తుంది. అదనంగా పొటాషియం రక్త నాళాలలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరం అంతటా మెరుగైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి గొప్ప వనరుగా ఉంటాయి. మష్రూమ్స్ మన రోగనిరోధక వ్యవస్థలో మైక్రోఫేజ్‌లను ప్రేరేపిస్తాయి. వాస్తవానికి వీటిని మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చడం వలన.. మీరు అనారోగ్యాల బారిన పడకుండా.. ఉండగలరు.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

మీరు బరువు తగ్గాలి అనుకుంటే.. అదనపు కిలోలను తగ్గించుకోవాలి అనుకుంటే.. మీరు ఖచ్చితంగా మీ ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకోవాలి. శారీరక వ్యాయామాలు, ఇతర జీవనశైలి మార్పులతో కలిపి ఆరోగ్యకరమైన మార్గంలో మష్రూమ్స్ తీసుకుంటే.. బరువు తగ్గడంలో ఇవి మీకు సహాయపడతాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి. వాస్తవానికి వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటు, ఇతర జీవక్రియ సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

క్యాన్సర్‌ను నివారించవచ్చు

సెప్టెంబరు 2021లో ప్రచురించబడిన 17 విభిన్న అధ్యయనాల్లో.. పుట్టగొడుగులు అధికంగా ఉండే ఆహారం తీసుకున్న వ్యక్తులు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడే అవకాశం 34% తక్కువగా ఉంది. యాంటీఆక్సిడెంట్లు ముఖ్యంగా ఎర్గోథియోనిన్, గ్లుటాతియోన్‌తో నిండి ఉంటాయి. అవి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి.

మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

సింగపూర్‌లో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 663 మంది పెద్దలు పాల్గొన్న ఒక అధ్యయనం ప్రకారం.. వారానికి కనీసం రెండు సేర్విన్గ్స్ పుట్టగొడుగులను తినే వారిలో తేలికపాటి అభిజ్ఞా బలహీనత (MCI) అభివృద్ధి చెందింది.

WhatsApp channel

సంబంధిత కథనం