Cleaning Tips : నల్లగా అయిన గిన్నెలు కూడా 5 నిమిషాల్లో తళతళ మెరిసేందుకు సింపుల్ చిట్కాలు-follow these cleaning tips to shine your iron and steel bowls within 5 minutes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cleaning Tips : నల్లగా అయిన గిన్నెలు కూడా 5 నిమిషాల్లో తళతళ మెరిసేందుకు సింపుల్ చిట్కాలు

Cleaning Tips : నల్లగా అయిన గిన్నెలు కూడా 5 నిమిషాల్లో తళతళ మెరిసేందుకు సింపుల్ చిట్కాలు

Anand Sai HT Telugu

Kitchen Tips : ఇంట్లో గిన్నెలు తోమి.. తోమి.. చేతులు నొప్పి పెడతాయి. కానీ వాటి మీద ఉన్న మరకలు మాత్రం పోవు. కానీ కొన్ని సాధారణ చిట్కాలు పాటిస్తే తల తల మెరిసేలా చేయెుచ్చు.

కిచెన్ క్లీనింగ్ టిప్స్ (Unsplash)

మీరు ఇంట్లో రోజూ వంట కోసం ఉపయోగించే పాత్రలు నూనె జిడ్డు, ఆహారపు మరకలు, స్టవ్ మంట, అనేక మసాలాలు, అధిక వేడి కారణంగా నల్లగా తయారవుతాయి. కడిగిన తర్వాత కూడా పోని మొండి మరకలను కలిగి ఉంటాయి. సాధారణంగా అందరి ఇళ్లలోనూ స్టీలు పాత్రలు కనిపిస్తాయి. కొన్ని స్టెయిన్‌లెస్ స్టీల్‌లు సులభంగా జిడ్డుగా మారవు. కానీ దోసె, రోటీ, చపాతీ కావలి, నూనె పాత్రలపై జిడ్డు పడితే దాన్ని తొలగించడం చాలా కష్టమైన పని అవుతుంది. మీరు మార్కెట్లో లభించే డజన్ల కొద్దీ ఉత్పత్తులను ఉపయోగించినప్పటికీ, మీరు ఈ జిడ్డును సులభంగా తొలగించలేరు.

అయితే ఈ రకమైన మరకలను సులభంగా వదిలించుకోవడానికి సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇనుము, రాగి వంటి పాత్రలను ఈజీగా తోముకోవచ్చు.

ఐరన్ పాత్రలో కూరగాయలు వండటం వల్ల వాటి ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. దానితో సమస్య ఏమిటంటే అది త్వరగా నల్లగా మారుతుంది. నూనె పొరలు దానిలో పేరుకుపోతాయి. ఈ సమస్య దాని హ్యాండిల్, అంచులలో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

నల్లబడిన ఐరన్ పాత్రలో వండిన ఆహారం కూడా నల్లగా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. చూసేందుకు బాగుండదు. అలాంటి పరిస్థితుల్లో మనం శుభ్రం చేయడం చాలా కష్టం. కానీ మీరు కొన్ని చిట్కాలను పాటించినట్లయితే, నల్లబడిన ఐరన్ పాత్రలను నిమిషాల్లో కొత్తదిగా మార్చవచ్చు.

సబ్బు, బేకింగ్ సోడా

ముందుగా వేడి నీటిలో సబ్బు పొడి లేదా సబ్బు, బేకింగ్ సోడా కలపండి. పాత్ర మునుపటిలా చేయెుచ్చు. 5 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత గిన్నె మీద ఉంచి అరగంట పాటు ఉంచాలి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో పాత్రను బాగా స్ర్కబ్ చేయడం ద్వారా పాత్రకు అంటుకున్న జిడ్డు సులభంగా తొలగిపోతుంది.

బేకింగ్ సోడాతో

ఐరన్ పాన్‌ను బేకింగ్ సోడాతో కొత్తదానిలా మెరిసేలా చేసుకోవచ్చు. దీని కోసం ఒక లీటరు నీటిలో నాలుగు చెంచాల బేకింగ్ సోడా, నాలుగు చెంచాల ఉప్పు వేసి మరిగించాలి. ఇప్పుడు ఈ వేడి నీళ్లను నల్లగా మారిన బాణలిలో పోసి అరగంట అలాగే ఉంచాలి. తర్వాత స్క్రబ్బర్‌తో స్క్రబ్ చేసి శుభ్రం చేయాలి.

నిమ్మకాయతో మాయం

నిమ్మకాయను చాలా కాలంగా అనేక వస్తువులను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం నల్లగా మారిన బాణలిలో రెండు గ్లాసుల నీళ్లు, నాలుగు చెంచాల నిమ్మరసం, నాలుగు చెంచాల డిటర్జెంట్ పౌడర్ వేసి నూనె వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వెనిగర్

వెనిగర్ మరకలను తొలగించడంలో సహాయపడే మరొక శక్తివంతమైన క్లీనింగ్ ఏజెంట్. ఒక కంటైనర్‌లో సమాన పరిమాణంలో నీరు, తెలుపు వెనిగర్ నింపి కొన్ని గంటలు లేదా రాత్రిపూట నాననివ్వండి. వెనిగర్ ఆమ్ల లక్షణాలు మరకలు పోయేందుకు సహాయపడతాయి. వాటిని తొలగించడం సులభం చేస్తుంది. నానబెట్టిన తర్వాత, మృదువైన బ్రష్‌తో స్క్రబ్ చేసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ చిట్కాలు పాటిస్తే గిన్నెలు 5 నిమిషాల్లోనే మెరిసిపోతాయి.