flipkart big billion days 2022 july: ఫ్లిప్‌కార్ట్‌లో 80 శాతం డిస్కౌంట్లు!-flipkart big saving days sale top deals discounts in flipkart big saving days ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Flipkart Big Billion Days 2022 July: ఫ్లిప్‌కార్ట్‌లో 80 శాతం డిస్కౌంట్లు!

flipkart big billion days 2022 july: ఫ్లిప్‌కార్ట్‌లో 80 శాతం డిస్కౌంట్లు!

HT Telugu Desk HT Telugu
Jul 21, 2022 06:00 PM IST

Flipkart Big Saving Days Sale: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ తేదీలను ప్రకటించింది. ఈనెల 23న ఈ సేల్‌ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్ సహా అన్ని ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్స్ ఉండనున్నాయి.

<p>Flipkart Big Saving Days Sale</p>
Flipkart Big Saving Days Sale

flipkart big billion days 2022 july: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) మరో భారీ సెల్‌ను ప్రకటించింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ (Flipkart Big Saving Days Sale) పేరుతో జూలై 23న భారీ డిల్ ప్రకటించింది. ఈ సేల్ జూలై 27 వరకు కొనసాగనుంది. ఈ డిల్‌లో కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, ప్యాషన్ వస్తువులు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్‌లు, టీవీల వంటి ప్రోడక్ట్స్‌పై డీల్‌లు, భారీ తగ్గింపులను పొందవచ్చు.

Oppo, Vivo, Motorola, Realme, Samsung వంటి స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా Apple ,టాబ్లెట్‌లతో సహా ఇతర ఎలక్ట్రానికి ప్రోడక్ట్స్‌పై సేల్‌లో భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న టాప్ ఆఫర్‌లను కంపెనీ ప్రకటించింది . సేల్‌లో Xiaomi, Realme టీవీలపై కూడా తగ్గింపులు ఉంటాయి. Flipkart తన సేల్ ప్రారంభం కాకముందే కొన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రారంభించింది.

దీనితో పాటు, సేల్ ధరకు డీల్‌ను ప్రీ-బుక్ చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది. కస్టమర్‌లు తమ ప్రాధాన్య ఉత్పత్తిని విక్రయ ధరలో ప్రీ-బుక్ చేయడానికి రూ. 1 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటించింది.

బ్యాంక్ ఆఫర్‌లు(bank offers): ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో, కస్టమర్‌లు డిస్కౌంట్‌లతో సహా బ్యాంక్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఈసారి ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు బ్యాంకు కార్డులకు సేల్‌లో తగ్గింపు ఇస్తున్నారు. Flipkart సేల్ పేజీలో తెలిపిన వివరాల ప్రకారం, కస్టమర్‌లకు యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ మరియు RBL బ్యాంక్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు ఇవ్వబడుతుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్‌లో ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్స్ వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది . ఈ సేల్‌లో కస్టమర్‌లు హెడ్‌ఫోన్‌లు, స్పీకర్‌ల వంటి ఆడియో ఉత్పత్తులను 70 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయగలుగుతారు. రూటర్, కీబోర్డ్ , మౌస్ వంటి కంప్యూటర్ యాక్సెసరీస్ భారీ తగ్గింపుతో లభిస్తాయి.

సేల్‌లో టాబ్లెట్‌లపై 45% వరకు తగ్గింపు ఇవ్వబడుతుంది . స్మార్ట్‌వాచ్ కొనుగోలుపై కస్టమర్‌లు 65 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. స్మార్ట్ టీవీలు, వాటి యాక్సెసరీస్ కొనుగోలుపై 70 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం