Homemade Wax Recipes : నొప్పి లేకుండా.. ఇంట్లోనే వాక్సింగ్ చేసుకోవాలనుకుంటే ఇది మీకోసమే..-five best and effective homemade wax recipes for hair removal you can try at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Homemade Wax Recipes : నొప్పి లేకుండా.. ఇంట్లోనే వాక్సింగ్ చేసుకోవాలనుకుంటే ఇది మీకోసమే..

Homemade Wax Recipes : నొప్పి లేకుండా.. ఇంట్లోనే వాక్సింగ్ చేసుకోవాలనుకుంటే ఇది మీకోసమే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 07, 2023 02:00 PM IST

Homemade Wax Recipes : వాక్స్ చేయించుకునేవారు కచ్చితంగా దానిని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. లేదంటే చిన్న చిన్న వెంట్రుకలు మీ లుక్​ని అందవిహీనంగా చేస్తాయి. అలా అని పార్లర్​కి పోవాలంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంట్లోనే సహజంగా ఈ హెయిర్​ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ​

వాక్సింగ్ టిప్స్
వాక్సింగ్ టిప్స్

Homemade Wax Recipes : శరీరంపైనున్న వెంట్రుకలను తొలగించడానికి వ్యాక్సింగ్​ అనేది ఓ ప్రసిద్ధ మార్గం. వ్యాక్సింగ్ అనేది చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడటమే కాకుండా.. ఆ ప్రాంతాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది. అయినప్పటికీ జుట్టు మూలం నుంచి తీయడం వల్ల దాని వల్ల కాస్త నొప్పి ఉంటుంది.

దానికి బదులుగా.. మీరు తక్కువ బాధాకరమైన, డబ్బు ఆదా చేసే హోమ్ వాక్సింగ్‌ను ప్రయత్నించవచ్చు. ఇవి సులువుగా హెయిర్ రిమూవ్ చేస్తాయి. అంతేకాకుండా.. తక్కువ బడ్జెట్​లో మీ చర్మాన్ని మృదువుగా మార్చేస్తాయి. అవేంటో.. వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చక్కెరతో వాక్స్

చక్కెరతో చేసిన ఈ సహజ మైనపు చికిత్స మీ చర్మానికి చాలా బాగుంది. పార్లర్ వాక్సింగ్ సెషన్‌ల కంటే సాధారణంగా తక్కువ బాధాకరంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది.

ఒక కుండలో చక్కెర, నిమ్మరసం, ఉప్పు, నీరు కలిపి కరిగించండి. మిశ్రమాన్ని ఉడకబెట్టి.. బాగా కలపండి. పంచదార పాకం వంటి రంగు వచ్చేవరకు స్టౌవ్ మీదనే ఉంచండి. అది ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. మీ చర్మం వేడిని తట్టుకోగలిగే తీరును బట్టి ఈ వాక్స్ ఉపయోగించుకోవచ్చు.

తేనెతో వాక్స్

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో నిండిన ఈ తేనె వాక్స్ మీ చర్మంపై జుట్టును సజావుగా తొలగిస్తుంది. రంధ్రాల నుంచి మలినాలను గ్రహిస్తుంది. ఇది జుట్టును తొలగించి.. తర్వాత మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

తేనె, నిమ్మరసం, వైట్ గ్రాన్యులేటెడ్ చక్కెరను కలిపి 30 సెకన్ల పాటు మైక్రోవేవ్ చేయండి. బాగా కలిపి మరో 30 సెకన్ల పాటు మైక్రోవేవ్ చేయండి. దానిని చల్లార్చి.. చర్మంపై అప్లై చేయండి.

ఫ్రూట్ వాక్స్

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌తో నిండిన ఈ పండ్ల మైనపు చర్మంపై సున్నితంగా ఉంటుంది. అన్ని రకాల శరీర వెంట్రుకలపై ఇది బాగా పనిచేస్తుంది. సున్నితమైన చర్మానికి కూడా ఇది చాలా మంచిది.

గ్రాన్యులేటెడ్ షుగర్, తాజా పల్పీ స్ట్రాబెర్రీ జ్యూస్, నిమ్మరసం, ఉప్పు, నీరు కలపండి. దానిలో కరిగిపోనిచ్చేవరకు బాగా కలపండి. మిశ్రమాన్ని ఉడకబెట్టి.. బాగా కదిలించండి. అది మైనపు ఆకృతిని పొందే వరకు ఉడికించండి. అంతే వాక్స్ చేయడానికి మిశ్రమం సిద్ధంగా ఉంది.

చాక్లెట్ వాక్స్

ఈ విలాసవంతమైన, స్వర్గపు వాసన కలిగిన మైనపు మిశ్రమంలో కోకో ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్లాంట్ కాంపౌండ్స్‌తో నిండి ఉంటుంది. కోకో రక్త ప్రవాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మీ చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.

కోకో పౌడర్, గ్రాన్యులేటెడ్ షుగర్, గ్లిజరిన్, ఉప్పు, నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని కరిగించండి. దీనిని బాగా ఉడకబెట్టి.. బాగా కలపండి. స్థిరత్వం సరిగ్గా వచ్చే వరకు వంట కొనసాగించండి. చల్లారనిచ్చిన తర్వాత వాక్స్ చేసుకోవచ్చు.

అలోవెరా వాక్స్

కలబందలోని అద్భుత గుణాలను కలిపి ఇంట్లో తయారుచేసిన ఈ మైనపు దట్టమైన వెంట్రుకలను తొలగించి మీ చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. ఇందులోని జెలటిన్ కొల్లాజెన్‌ని పెంచి మీ చర్మాన్ని దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది.

జెలటిన్, అలోవెరా జెల్, పచ్చి పాలు, మైక్రోవేవ్‌లో కొన్ని సెకన్ల పాటు కలపండి. వెంట్రుకలు పెరిగే ప్రదేశంపై దీన్ని అప్లై చేయండి. పూర్తిగా ఆరిన తర్వాత మెల్లగా తీసేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్