తెలుగు న్యూస్ / ఫోటో /
Tips to Control Frizzy Hair : నిర్జీవమైన జుట్టును.. ఇలా మృదువుగా మార్చేసుకోండి..
- మీ జుట్టు పొడిబారిపోయి ఉందా? కానీ అప్పుడే బయటకు వెళ్లాల్సి వస్తుందా? షాంపూ చేసే టైం లేదా? అయితే ఇది మీకోసమే. నిర్జీవమైన జుట్టును షాంపూ చేయకముందే స్మూత్, షైనీగా మార్చే చిట్కాలు ఇక్కడ మీకోసం ఉన్నాయి. అవేంటో చూసి.. ఫాలో అయిపోండి.
- మీ జుట్టు పొడిబారిపోయి ఉందా? కానీ అప్పుడే బయటకు వెళ్లాల్సి వస్తుందా? షాంపూ చేసే టైం లేదా? అయితే ఇది మీకోసమే. నిర్జీవమైన జుట్టును షాంపూ చేయకముందే స్మూత్, షైనీగా మార్చే చిట్కాలు ఇక్కడ మీకోసం ఉన్నాయి. అవేంటో చూసి.. ఫాలో అయిపోండి.
(1 / 6)
రోజంతా మీరు ఆఫీసు, పనిలో బిజీగా ఉంటూ హెయిర్ కేర్ తీసుకోలేరు. మీ జుట్టు సంరక్షణకు సమయం ఎక్కడ ఉంటుంది? మీరు ఇంటికి తిరిగి వచ్చేసరికి మీ జుట్టు పూర్తిగా ఎండిపోయి చిట్లినట్లు కనిపిస్తుంది. బయటకు వెళ్లినప్పుడు హెయిర్‌ను లీవ్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీ హెయిర్ మృదువుగా మారుతుంది అంటున్నారు నిపుణులు. మీరు ట్రై చేయండి.
(2 / 6)
డ్రై హెయిర్‌ను షాంపూ చేసే ముందు ఇంట్లోనే ఓ మిశ్రమాన్ని తయారు చేసుకోండి. బాదం నూనె, అలోవెరా జెల్ మిశ్రమాన్ని అప్లై చేయండి. తలకు అప్లై చేసిన తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
(3 / 6)
పొడి, చిట్లిన జుట్టును స్ట్రెయిట్ చేయడానికి మాయిశ్చరైజింగ్ షాంపూని ఉపయోగించండి. అనంతరం కండీషనర్‌ను వాడండి. దీనివల్ల జుట్టు స్మూత్‌గా మారుతుంది. మీరు బియ్యం కడిగిన నీటిని ఉపయోగించిన హెయిర్ మంచిగా, హెల్తీగా మారుతుంది.
(4 / 6)
మైక్రోఫైబర్ టవల్‌తో జుట్టును తలకు మంచిది. ఈ టవల్‌తో జుట్టును తడపండి. తర్వాత ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకుని మీ తల నుంచి మిగిలిన నీటిని తుడిచేయండి. తర్వాత జుట్టును కాసేపు ఆరనివ్వాలి. ఇది జుట్టుకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఫలితంగా కేశాలంకరణ మెరుగ్గా ఉంటుంది.
(5 / 6)
జుట్టు పొడిగా ఉన్న వెంటనే హెయిర్ సీరమ్‌ను అప్లై చేయండి. ఆపై మీరు మీ జుట్టును మీకు కావలసిన విధంగా స్టైల్ చేయాలనుకుంటే హెయిర్ మిస్ట్ చేయండి. జుట్టు కచ్చితంగా అందంగా కనిపిస్తుంది.
ఇతర గ్యాలరీలు