Paneer Side Effects। పనీర్ ఎక్కువగా తింటే పని ఖతమే.. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి-eating excess paneer is absolutely unhealthy know side effects ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Side Effects। పనీర్ ఎక్కువగా తింటే పని ఖతమే.. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి

Paneer Side Effects। పనీర్ ఎక్కువగా తింటే పని ఖతమే.. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి

HT Telugu Desk HT Telugu
Oct 12, 2022 07:03 PM IST

మీకు పనీర్ అంటే బాగా ఇష్టమా? అయితే మీ ఇష్టాన్ని మార్చుకోండి. ఎందుకంటే ఎక్కువగా పనీర్ తింటే ఆరోగ్యపరంగా చాలా దుష్ప్రభావాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరింత సమాచారం కోసం చదవండి.

Eating excess paneer may have side effects
Eating excess paneer may have side effects (Unsplash)

శాఖాహార వంటకాల్లో ఏదైనా ప్రత్యేకంగా తినాలనుకుంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పనీర్ వంటకాలే. పార్టీ అయినా, రెస్టారెంట్ అయినా వెజ్ -మెనూలో మరో ఆప్షన్ లేకుండా ఎక్కువగా పనీర్‌తో చేసిన వంటకాలే ఉంటాయి. శాఖాహారులకు చికెన్, మటన్ లు అంటే పనీరే. మాంసాహారులు కూడా పనీర్ ఇష్టంగానే తింటారు. పాలతో తయారయ్యే మృదువైన, వెల్వెట్ లాంటి ముక్కలు పంటి కింద వేసి మెత్తగా కొరికి తినాలనిపిస్తుంది. నాలుకకు మంచి రుచి తగలటమే కాకుండా శరీరంలో ప్రోటీన్ అవసరాలను తీరుస్తుంది. కాల్షియం స్థాయిలను మెరుగుపరుస్తుంది.

ఒకే, రైట్, ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. కానీ పనీర్‌కు మరో యాంగిల్ కూడా ఉంది. పనీర్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తాజాగా పలు ఆరోగ్య నివేదికలు పేర్కొన్నాయి.

Paneer Side Effects- పనీర్ అధికంగా తింటే కలిగే దుష్ప్రభావాలు

ఆహారంలో పనీర్ ఎక్కువగా తీసుకోవడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఆరోగ్య నిపుణులు వివరించారు. జాబితా పెద్దగానే ఉంది. ఆ దుష్ప్రభావాల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇక్కడ పేర్కొన్నాం, పరిశీలించండి.

జీర్ణక్రియ సంబంధిత సమస్యలు

పనీర్‌లో లాక్టోస్ ఎక్కువగా ఉన్నందున ఇది మీకు ఉబ్బిసం అనుభూతిని కలిగిస్తుంది, కడుపులో గ్యాస్‌ను సృష్టిస్తుంది. అజీర్ణం, కడుపు నొప్పులు బాధించవచ్చు. ప్రొటీన్‌ సమృద్ధిగా ఉండటం వలన పనీర్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది కడుపు ఉబ్బరం, ఏసిడిటీకిదారితీస్తుంది.

అధిక కొలెస్ట్రాల్

అధిక రక్తపోటుతో బాధపడేవారు పనీర్‌కు దూరంగా ఉండాలి. పనీర్ అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది, తద్వారా గుండె సమస్యలకు దారితీస్తుంది.

బరువు పెరుగుట

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, మీ డైట్ నుంచి పనీర్‌ను తొలగించవలసి ఉంటుంది. కొవ్వులతో నిండిన పనీర్ మీ బరువును మరింత పెంచేలా చేస్తుంది. కడుపులో గ్రాముల్లో వేసే పనీర్ శరీరంలోనూ కిలోలను పెంచుతుంది, దీంతో మీ బరువు తగ్గే ప్రణాళిక పట్టాలు తప్పుతుంది.

అలర్జీలు

పనీర్ వినియోగం కొంతమంది వ్యక్తులలో అలెర్జీలకు దారి తీస్తుంది. నాణ్యతలేని పనీర్ అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది, ఫలితంగా చర్మంపై దద్దుర్లు, దురదలు ఏర్పడవచ్చు. పనీర్‌ను కొనుగోలు చేసేటపుడు తప్పకుండా దాని గడువు తేదీని చెక్ చేయాలి.

ఫుడ్ పాయిజనింగ్ సమస్య

ఫుడ్ పాయిజనింగ్‌కు సులభంగా గురయ్యే వ్యక్తులు కూడా పనీర్‌ను తినకూడదు. పనీర్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం