Sunday Motivation: విమర్శలకు కుంగిపోకండి, వాళ్లు విసిరిన రాళ్ళనే మీ ఎదుగుదలకు పునాదిగా మార్చుకోండి-dont get depressed by criticism make the stones thrown by them as the foundation for your growth ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation: విమర్శలకు కుంగిపోకండి, వాళ్లు విసిరిన రాళ్ళనే మీ ఎదుగుదలకు పునాదిగా మార్చుకోండి

Sunday Motivation: విమర్శలకు కుంగిపోకండి, వాళ్లు విసిరిన రాళ్ళనే మీ ఎదుగుదలకు పునాదిగా మార్చుకోండి

Haritha Chappa HT Telugu
Apr 07, 2024 05:00 AM IST

Sunday Motivation: విమర్శలు కొన్నిసార్లు మేలే చేస్తాయి. ఆ మేలును గ్రహిస్తే మీరు కుంగిపోరు. విమర్శలకు బాధపడడం మొదలుపెడితే మీరు జీవితంలో ఏదీ సాధించలేరు.

విమర్శలు పాజిటివ్‌గా తీసుకోవాలి
విమర్శలు పాజిటివ్‌గా తీసుకోవాలి (Pixabay)

haSunday Motivation: మీరు చేసిన ప్రతి పని అందరికీ నచ్చాలని లేదు, కొంతమందికి నచ్చవచ్చు.. కొందరికి నచ్చకపోవచ్చు. ఎవరికి నచ్చదో వారు ఆ పనిలో లోపాలు వెతికి విమర్శలు చేస్తారు. ఆ విమర్శలను పాజిటివ్‌గా తీసుకొని మీరు చేసిన పనిలో లోపాలను అధిగమిస్తే విజయం అందుతుంది. కానీ విమర్శలకు కుంగిపోతే మాత్రం ఒక్క అడుగు ముందుకు వేయలేరు. ఇది మీలో డిప్రెషన్‌కు కారణం అవుతుంది. విమర్శను అంతా పాజిటివ్ గానే తీసుకోవాలి. ప్రతి విమర్శ మిమల్ని ఎదిగేందుకు ఒక్కో మెట్టుగా పనికొస్తాయి.

విమర్శలను రాళ్లగా భావిస్తే ప్రతి రాయిని ఒడిసి పట్టుకొని మీ ఎదుగుదలకు పునాదులుగా మార్చుకోండి. విమర్శలకు చాలా శక్తి ఉంటుంది. పాజిటివ్‌గా తీసుకుంటే విజయాన్ని చేరువ చేస్తుంది. అదే నెగిటివ్‌గా తీసుకుంటే అధ: పాతాళానికి తొక్కేస్తుంది. మీరు విమర్శను ఎలా తీసుకున్నారు? అన్న దానిపైన ఫలితం ఆధారపడి ఉంటుంది.

విమర్శ వచ్చేది మెదడు నుంచే. మెదడు ఒక పనిలో ముప్పును లేదా ప్రమాదాన్ని గుర్తిస్తేనే దాన్ని విమర్శగా మార్చి బయటకు చెప్పేలా చేస్తుంది. ఎదుట వ్యక్తి మీ పనిలో ఏదో ఒక లోపాన్ని గుర్తించినప్పుడే వారు విమర్శలు చేయడం మొదలు పెడతారు. కాబట్టి విమర్శలో నిజం ఉందో లేదో ఆలోచించండి. మీకు అది నిజమే అనిపిస్తే పౌరుషానికి పోకుండా సరిదిద్దుకునేందుకు ప్రయత్నించండి.

ప్రతి మనిషి తప్పు చేస్తాడు. ఆ తప్పును దిద్దుకుంటేనే గొప్ప వ్యక్తి అవుతాడు. మీరు కూడా ప్రస్తుతం సాధారణ మనిషి. మీరు గొప్ప వ్యక్తిగా మారాలంటే విమర్శను పాజిటివ్ గా తీసుకొని ఎదగడానికి ప్రయత్నించండి.

విమర్శకులలో కొందరు మంచి విమర్శకులు కూడా ఉంటారు. వారు అనుభవంతో కూడిన అంతర్దృష్టితో ఆలోచిస్తారు. వారి వైఖరి, విచారణ, నైపుణ్యాలు, సమగ్రత, సరైన నిర్ణయాలని చెబుతాయి. కాబట్టి మంచి విమర్శకులు చెప్పిన ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకొని మిమ్మల్ని మీరు మార్చుకోవాలి.

ఒక ఫీడ్ బ్యాక్‌గా భావించాలి. అన్నీ పాజిటివ్ గా ఉండాలని కోరుకోవడం స్వార్ధమే అవుతుంది. సానుకూలంగా చెబితే మంచి, ప్రతికూలంగా చెబితే చెడు అనుకుంటే మీరు జీవితంలో ఎదగలేరు. ప్రతి విమర్శను సానుకూలంగా తీసుకొని ముందుకు సాగండి.

Whats_app_banner