wheat flour garlic dosa: క్రిస్పీగా ఉండే గోదుమపిండి వెల్లుల్లి దోశ-delicious wheat flour garlic dosa making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wheat Flour Garlic Dosa: క్రిస్పీగా ఉండే గోదుమపిండి వెల్లుల్లి దోశ

wheat flour garlic dosa: క్రిస్పీగా ఉండే గోదుమపిండి వెల్లుల్లి దోశ

Koutik Pranaya Sree HT Telugu
May 19, 2023 06:30 AM IST

wheat flour garlic dosa: గోదుమపిండి, వెల్లుల్లి కాంబినేషన్ తో రుచిగా, క్రస్పీగా ఉండే దోశ ఎలా చేసుకోవాలో చూడండి.

గోదుమపిండి వెల్లుల్లి దోశ
గోదుమపిండి వెల్లుల్లి దోశ (unsplash)

చాలా మందికి వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చుతుంది. కొంతమందికి క్రిస్పీగా ఉండే దోశెలు నచ్చుతాయి. ఈ రెండూ ఉండేలా గోదుమపిండితో క్రిస్పీ దోశెలు చేసేయండి. చాలా రుచిగా ఉంటాయి.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు గోదుమ పిండి

1 చెంచా బియ్యం పిండి

1 చిల్లీ ఫ్లేక్స్

1 చెంచా వెల్లుల్లి ముద్ద

2 స్పూన్ల కొత్తిమీర తరుగు

2 స్పూన్ల నెయ్యి లేదా నూనె

2 కప్పుల నీళ్లు

తగినంత ఉప్పు

తయారీ విధానం:

  1. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తప్ప పైన చెప్పిన పదార్థాలన్నీ వేసుకోవాలి.
  2. ముందుగా కప్పు నీళ్లు పోసుకుని పిండి కలుపుకోవాలి. మెల్లమెల్లగా నీళ్లు పోసుకుంటూ పలుచని మిశ్రమంలా చేసుకోవాలి.
  3. పెనం వేడి చేసి పలుచగా దోసె లాగా వేసుకోవాలి. అంచుల వెంబడి నూనె లేదా నెయ్యి వేసుకోవాలి. దోశ క్రిస్పీగా రావాలంటే సన్నం మంట మీద కనీసం 5 నిమిషాలుంచుకోవాలి. లేదంటే మెత్తగా ఉంటుంది.
  4. అంతే దోశ సిద్ధం. దీంట్లో వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి, చట్నీ లేకుండా కూడా తినేయొచ్చు.

WhatsApp channel