Chanakya Niti : స్త్రీలలో ఈ 3 లక్షణాలు ఉండకూడదు.. వారి జీవితం నరకమే!-chanakya niti good and worst qualities of women details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti : స్త్రీలలో ఈ 3 లక్షణాలు ఉండకూడదు.. వారి జీవితం నరకమే!

Chanakya Niti : స్త్రీలలో ఈ 3 లక్షణాలు ఉండకూడదు.. వారి జీవితం నరకమే!

HT Telugu Desk HT Telugu
Apr 24, 2023 01:33 PM IST

Chanakya Niti About Women : ఆచార్య చాణక్యుడు తన విలువైన జ్ఞానం, అనుభవాన్ని చాణక్య నీతిగా సంకలనం చేశాడు. ఈ పుస్తకంలో జీవితానికి, గృహస్థ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని చాణక్య నీతి చెబుతోంది.

చాణక్య నీతి
చాణక్య నీతి

'స్త్రీ ద్వారా సృష్టి, స్త్రీ ద్వారా వినాశనం' అనే నానుడిని ప్రగాఢంగా విశ్వసించాడు చాణక్యుడు. అందుకే స్త్రీలు సమాజాన్ని నిర్మించడంతోపాటు నాశనం చేయగలరని నమ్మాడు. కుటుంబ వికాసానికే కాకుండా సమాజ వికాసానికి కూడా మహిళకు విద్య చాలా అవసరం. వారి వ్యక్తిగత వికాసానికి కూడా ముఖ్యం. అందుకే చాణక్యుడు స్త్రీలు విద్యను పొందడంలో ఎల్లప్పుడూ నిశ్చయత, పట్టుదలతో ఉండాలని కోరారు.

yearly horoscope entry point

ఆధ్యాత్మిక కార్యకలాపాలలో స్త్రీతో పాటు పురుషుడి విశ్వాసం కూడా అవసరమని చాణక్యుడు నమ్మాడు. ఆధ్యాత్మికత పిల్లలకు మంచి విలువలను అందజేస్తుంది. తద్వారా మంచి సమాజం ఏర్పడుతుంది. కొన్ని లక్షణాలు స్త్రీలలో ఉంటే మంచిది కాదని చాణక్యుడు చెప్పాడు.

స్త్రీలకు అహంకారం అత్యంత ప్రమాదకరమైన లక్షణంగా అభివర్ణించారు ఆచార్య చాణక్య. ఒక స్త్రీలో అహం వచ్చినప్పుడల్లా, సరస్వతి, లక్ష్మీ దేవి ఇద్దరూ ఆమెపై కోపం తెచ్చుకుని ఆమెను విడిచిపెడతారు. అటువంటి పరిస్థితిలో మనస్సు వికలమై, కుటుంబ ఆనందం, శ్రేయస్సు క్రమంగా నశించడం ప్రారంభమవుతుందని చాణక్యుడు చెప్పాడు.

అత్యాశతో ఉన్న స్త్రీలు తమ ఇంటి ఆనందానికి, శాంతికి ప్రమాదంగా ఉంటారని చాణక్యుడు తెలిపాడు. ఇలా ఉండే మహిళల కుటుంబ జీవితం ఒత్తిడితో కూడుకున్నది. ఒత్తిడి ఒక వ్యక్తి మేధస్సును ప్రభావితం చేస్తుంది. ఇది మొత్తం కుటుంబం పురోగతిని అడ్డుకుంటుంది.

మరో ముఖ్య విషయం ఏంటంటే.. స్త్రీ మరొకరిపై ఆధారపడొద్దు. అలా చేస్తే ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కాబట్టి మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ ఇంటి కాపాడుకున్నట్టే.. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మహిళల విషయంలో ఎవరినీ నమ్మవద్దని చాణక్యుడు సలహా ఇస్తున్నాడు.

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో సామాజిక సంక్షేమానికి సంబంధించి.. అనేక విధానాలను అందించాడు. ఈ విధానాలను అర్థం చేసుకుని.. జీవితంలో అనుసరించే వ్యక్తులకు చాలా బాధలు దూరమవుతాయని చెబుతారు. ఈ కాలంలోనూ.. చాణక్య విధానాలు బాగా ప్రాచుర్యం పొందాయి.

మానవ జీవితాన్ని విజయవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలు చాణక్య విధానంలో ఉంటాయి. చాణక్య విధానంలో భవిష్యత్తును అందంగా మార్చుకునే మార్గాలను అందించాడు. అదే విధంగా జీవితంలో విజయవంతం కావడానికి, చెడు వ్యక్తులను నివారించడానికి మార్గాలను కూడా ఇచ్చాడు. ఆచార్య చాణక్యుడు(Chanakyudu) తన నీతి శాస్త్రంలో పలు విషయాల గురించి వివరంగా తెలిపాడు.

Whats_app_banner

సంబంధిత కథనం