Palakura Idli : పాలకూర ఇడ్లీ.. ఇలా తయారుచేయాలి.. బ్రేక్‌ఫాస్ట్‌లోకి తినండి-breakfast recipes how to make palakura idli recipe for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palakura Idli : పాలకూర ఇడ్లీ.. ఇలా తయారుచేయాలి.. బ్రేక్‌ఫాస్ట్‌లోకి తినండి

Palakura Idli : పాలకూర ఇడ్లీ.. ఇలా తయారుచేయాలి.. బ్రేక్‌ఫాస్ట్‌లోకి తినండి

HT Telugu Desk HT Telugu
Mar 27, 2023 06:30 AM IST

palakura idli : కొంతమంది ప్రతి రోజూ ఇడ్లీనే తింటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇడ్లీ తినడమే బెటర్ అంటారు. అయితే రోజూ ఒకే లాగా తింటే బోర్ కొడుతుంది కదా. అందుకే కొత్తగా పాలకూర ఇడ్లీ ట్రై చేయండి.

పాలకూర ఇడ్లీ
పాలకూర ఇడ్లీ

ఉదయం చాలామంది బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీలే తినేందుకు ఇష్టపడుతారు. మినప పప్పుతో చేసే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే ఇడ్లీలను రోజూ ఒకేలా చేసుకుంటే.. ఏం బాగుంటంది. అందుకే ఒక్కో రోజు ఒక్కోలా ట్రై చేయండి. పాలకూరతోనూ ఇడ్లీలు తయారు చేయచ్చు. రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది. పాలకూర ఇడ్లీలను తయారు చేయడం కూడా సులభమే. పెద్దగా పని ఉండదు. అప్పటికప్పుడు కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు

అరకప్పు నానబెట్టిన పెసరుపప్పు, పాల‌కూర-ముప్పావు క‌ప్పు, త‌రిగిన ప‌చ్చి మిర్చి-1 టేబుల్ స్పూన్‌, పెరుగు-1 టేబుల్ స్పూన్‌, నీళ్లు తగినంత, ఉప్పు త‌గినంత‌, సరిపోయేంత నూనె.

మెుదట మిక్సీలో పెసరు పప్పు, పాలకూర, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో పెరుగు, ఉప్పు కలుపుకోవాలి. నీళ్లు సరిపోయేంత పోయాలి. అనంతరం ఇడ్లీ పాత్రలకు నూనె రాసి.. మిశ్రమాన్ని అందులో పెట్టుకోవాలి. తర్వాత ఆవిరిలో ఈ పాత్రలను పెట్టి.. 15 నిమిషాలను పాటు ఉడికించాలి. తర్వాత వేడి వేడి పాలకూర ఇడ్లీ తయారుఅవుతాయి. చట్నీ లేదా సాంబర్ తో కలిపి తినేయోచ్చు. ఎంతో రుచికరంగా ఉంటాయి.

దోశెను కూడా వివిధ రకాల పోషకాలు చేర్చి తినొచ్చు. కావాల్సిన పదార్థాలు ఇవే..

పొట్టు తీయని పెసరపప్పు-అర కప్పు, మినప గుళ్లు-ఒక కప్పు, క్యారెట్ తురుము-అరకప్పు, కొత్తిమీర తురుము-పావు కప్పు, నూనె-సరిపడా, ఉప్పు-రుచికి తగినంత.

మెుదట పెసరపప్పు, మినప గుళ్లను నానబెట్టాలి. రాత్రి నానబెట్టుకుంటే మరుసరి రోజు ఉదయానికి అవి మెత్తగా తయారవుతాయి. పెసరపప్పు పొట్టును తీయకూడదు. పప్పులను కడిగేసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. పప్పులను కలిపేసే రుబ్బుకోవాలి. అందులో కాస్త.. ఉప్పు, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము వేసి కలపాలి. ఆ తర్వాత వాటిని దోశెల్లా పోసుకోవాలి. కొబ్బరి చట్నీ, టమాటా చట్నీతో ఈ దోశెను తినొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం