Amazon Sale& Flipkart Sale: ఆకట్టుకునే ధరలతో కస్టమర్ల్​ను ఆకర్షిస్తున్నఇ-కామర్స్-amazon great freedom festival and flipkart big saving day sales start from august 6th ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Amazon Great Freedom Festival And Flipkart Big Saving Day Sales Start From August 6th

Amazon Sale& Flipkart Sale: ఆకట్టుకునే ధరలతో కస్టమర్ల్​ను ఆకర్షిస్తున్నఇ-కామర్స్

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 02, 2022 03:22 PM IST

Amazon Sale& Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఈ నెలలో తమ తమ సేల్స్​ను ప్రకటించాయి. ఫ్లిప్‌కార్ట్.. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌తో రానుండగా… అమెజాన్.. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌తో కస్టమర్​లకు అందుబాటులోకి రానుంది. మరి ఎప్పటినుంచి ఈ సేల్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌

Amazon Sale& Flipkart Sale: ఇ-కామర్స్ ప్లేయర్‌లు అమెజాన్ సేల్, ఫ్లిప్‌కార్ట్ సేల్​తో మీ ముందుకు మరోసారి వచ్చేస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్​తో, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్​తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు, ఇతర ఉపకరణాలపై తగ్గింపులను అందిస్తున్నాయి.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్టు 6వ తేదీన ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు 10వ తేదీ వరకు కొనసాగుతుంది. SBI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే వారికి 10 శాతం తక్షణ తగ్గింపు, 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

సేల్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు రూ.6,599 నుంచి ప్రారంభమవుతాయి. మొబైల్ యాక్సెసరీలు రూ.69 నుంచి ప్రారంభమవుతాయి. నో-కాస్ట్ ఈఎంఐలు రూ.2,083 నుంచి ప్రారంభమవుతాయి. వాషింగ్ మెషీన్లపై 50 శాతం వరకు తగ్గింపుతో విక్రయించనున్నారు. ఫ్రిజ్‌లు రూ.6990 నుంచి ప్రారంభం కానున్నాయి. టీవీలు రూ. 5,999తో ప్రారంభమవుతాయి. EMIలో తీసుకోవాలి అనుకుంటే రూ. 1,333 నుంచి ప్రారంభం కానుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ ఆగస్టు 6న ప్రారంభమై.. ఆగస్టు 10వ తేదీన ముగుస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఆగస్టు 5నుంచే సేల్ ప్రారంభమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి వస్తువులను కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

దాదాపు అన్ని తయారీదారుల నుంచి టాబ్లెట్‌లపై 45 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. కంప్యూటర్ ఉపకరణాలపై కంపెనీ 70 శాతం వరకు తగ్గింపును కూడా ఇస్తుంది. టెలివిజన్, వాషింగ్ మెషీన్లు వంటి గృహోపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్