Vinayak Chavithi 2022 : వినాయకుని గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?-6 facts about ganesh chaturthi you probably didn t know about ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vinayak Chavithi 2022 : వినాయకుని గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?

Vinayak Chavithi 2022 : వినాయకుని గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 27, 2022 12:55 PM IST

Vinayak Chavithi 2022 : మరికొన్ని రోజుల్లో వినాయకచవితి రానుంది. ఇప్పటికే మండపాలు సిద్ధమైపోతున్నాయి. పూజకు అన్ని సిద్ధం చేస్తున్నారు. పైగా ఈ పండుగను 10 రోజులకు పైగా నిర్వహిస్తారు. అయితే వినాయకుని గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడున్నాయి.

వినాయకుని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలివే..
వినాయకుని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలివే..

Vinayak Chavithi 2022 : వినాయక చవితిని భక్తులు ఘనంగా జరుపుకుంటారు. దాదాపు 12 రోజులు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం హిందూ చాంద్రమాన క్యాలెండర్ మాసం భాద్రపద నాల్గవ రోజున వినాయక చవితిని నిర్వహిస్తారు. ఇది భారతదేశంలోని అతి పెద్ద పండుగలలో ఒకటి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీనిని అంగరంగ వైభవంగా చేస్తారు. అయితే వినాయకుడి గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడున్నాయి.

వినాయక చవితిని ఎప్పుడు చేస్తారంటే..

వినాయకుడు భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో జన్మించాడని నమ్ముతారు కాబట్టి గణేష్ చతుర్థి పండుగను ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్ మాసమైన భాద్రపదలో జరుపుకుంటారు. ఇది శుక్ల చతుర్థి (నాల్గవ రోజు) నాడు ప్రారంభమవుతుంది.

షోడశోపచార నివాళులు..

ఆవాహన, ప్రతిష్ఠాపన, ఆసన సమర్పణ, అర్ఘ్య సమర్పణ, ఆచమన, మధుపర్క, స్నాన, వస్త్ర సమపాన, యాగ్యోపవిత్, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య, తాంబ్లూవ దశలు ఉన్నాయి.

ఇష్టమైన ప్రసాదంతో ప్రసన్నమైపోతాడు

గణేష్‌కు ఇష్టమైన ఉండ్రాలను భక్తులు వినాయకుడికి సమర్పిస్తారు. అవి అంటే ఆయనకు చాలా ప్రీతీ అని భావిస్తారు. బొబ్బట్లు కూడా ఆయనకు ఇష్టమని భక్తులు భావిస్తారు.

పార్వతీ దేవి అనుగ్రహంతో

పురాణాల ప్రకారం.. పార్వతీ దేవి స్నానం చేస్తున్నప్పుడు తన శరీరంపై పూసిన నలుగు నుంచి గణేశుడిని సృష్టించింది. ఆమె స్నానం పూర్తయ్యే వరకు కాపలాగా ఉంచింది. శివుడు దూరంగా ఉన్నారని గణేశుడికి తెలియదు కాబట్టి.. శివుడు తిరిగి వచ్చినప్పుడు వినాయకుడు అతన్ని లోపలికి రానివ్వకుండా మొండిగా ప్రవర్తిస్తాడు. ఆగ్రహానికి గురైన శివుడు తన త్రిశూలంతో వినాయకుని తల నరికి ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇది తెలుసుకున్న పార్వతికి కోపం, బాధతో రోదిస్తూ ఉంటుంది.

మళ్లీ ప్రాణం పోసుకుని..

పార్వతి వేదనను చూసిన శివుడు వినాయకుడిని మళ్లీ బ్రతికిస్తానని మాట ఇస్తాడు. అలా ఏనుగు తలను గణేషుడికి అమర్చి.. వినాయకుడిని తిరిగి బ్రతికించారు.

దేవతలకు సహాయం చేయడానికై..

గణేశుడి జననం చుట్టూ తిరిగే మరో కథ ఏమిటంటే.. గణేశుడు రాక్షసుల మార్గంలో విఘ్నకర్తగా ఉండాలనే దేవతల అభ్యర్థన మేరకు శివుడు, పార్వతి ద్వారా గణేశుడు సృష్టించబడినట్లు చెప్తారు.) దేవతలకు సహాయం చేయడానికి వినాయకుడు వచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం