Zee Telugu Saregamapa: పాటలు బాగా పాడతారా.. జీ తెలుగు సరిగమప ఆడిషన్స్‌ షురూ.. మీ వివరాలను ఆన్‌లైన్‌లో ఇలా పంపండి-zee telugu sa re ga ma pa auditions send your entries online zee telugu channel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zee Telugu Saregamapa: పాటలు బాగా పాడతారా.. జీ తెలుగు సరిగమప ఆడిషన్స్‌ షురూ.. మీ వివరాలను ఆన్‌లైన్‌లో ఇలా పంపండి

Zee Telugu Saregamapa: పాటలు బాగా పాడతారా.. జీ తెలుగు సరిగమప ఆడిషన్స్‌ షురూ.. మీ వివరాలను ఆన్‌లైన్‌లో ఇలా పంపండి

Hari Prasad S HT Telugu

Zee Telugu Saregamapa: మీరు పాటలు బాగా పాడతారా? అయితే ఈ అవకాశం మీ కోసమే. జీ తెలుగు సరిగమప షో కోసం ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌లోనే మీ ఎంట్రీలను పంపే అవకాశం ఉంది.

పాటలు బాగా పాడతారా.. జీ తెలుగు సరిగమప ఆడిషన్స్‌ షురూ.. మీ వివరాలను ఆన్‌లైన్‌లో ఇలా పంపండి

Zee Telugu Saregamapa: జీ తెలుగు ఛానెల్ యువ సింగర్లకు బంపర్‌ ఆఫర్ ఇస్తోంది. తమ సింగింగ్ రియాల్టీ షో సరిగమప 15వ సీజన్‌ త్వరలోనే ప్రారంభించబోతోంది. దీనికోసం ఆ ఛానెల్ ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌లోనే ఎంట్రీలను ఆహ్వానించడం విశేషం. మీకు పాటలు పాడటం ఇష్టమైతే.. సింగింగ్ యూత్‌ ఐకాన్‌గా మారాలని అనుకుంటే ఈ ఆడిషన్స్‌లో పాల్గొని ఎంపికవ్వండి.

సరిగమప ఆడిషన్స్‌

నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ కోసం చూస్తున్న జీ తెలుగు ఛానెల్ తమ సింగింగ్ రియాల్టీ షో సరిగమప కొత్త సీజన్‌ను తీసుకొస్తోంది. ఈ 15వ సీజన్ కోసం ఆల్‌లైన్‌ ఆడిషన్స్‌ నిర్వహిస్తోంది. మీరు పాటలు బాగా పాడితే.. మీ వయసు 15 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటే వెంటనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. దీనికోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంటి నుంచే ఎంట్రీలను సబ్‌మిట్ చేయొచ్చు.

ఆన్‌లైన్‌ ఆడిషన్స్‌ ఇలా..

జీ తెలుగు ఛానెల్ ఈ సరిగమప షో కోసం ఆన్‌లైన్‌లోనే ఆడిషన్స్‌ నిర్వహిస్తుండటం విశేషం. ఇందులో పాల్గొనాలంటే మీరు సింపుల్‌గా మీరు పాట పాడుతున్న 2 నిమిషాల వీడియోతోపాటు మీ పేరు, ఊరు వివరాలను పంపించాల్సి ఉంటుంది. మీ ఆడిషన్‌ను వాట్సాప్‌ నంబర్‌ 9154670067కు గానీ.. ztsaregamapa@zee.com ఈమెయిల్‌కుగానీ పంపించవచ్చు.

సరిగమప 15వ సీజన్ ఆన్‌లైన్‌ ఆడిషన్స్‌ వివరాలను వెల్లడిస్తూ జీతెలుగు ఓ వీడియో రిలీజ్ చేసింది. "నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్‌ అయ్యే గోల్డెన్‌ ఛాన్స్ మిస్‌ అవ్వకండి.. మీరు పాడిన పాటను రికార్డు చేసి మీ వివరాలను 9154670067 నంబర్‌కు వాట్సాప్ చేయండి లేదా ztsaregamapa@zee.comకు పంపించండి" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేసింది.

తెలుగుతోపాటు హిందీలోనూ జీ ఛానెల్ సరిగమప షోకి మంచి ఆదరణ ఉంది. తెలుగులో ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకుందీ రియాల్టీ షో. ఇప్పుడు 15వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి వినూత్నంగా ఆన్‌లైన్‌ ఆడిషన్స్ నిర్వహిస్తుండటంతో దీనికి పెద్ద ఎత్తున స్పందన లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.