Yoga Day: యోగా ప్రాముఖ్యతను తెలిపే స్పెషల్ పోగ్రామ్.. A-Z యోగాసనాలతో మంతెన సత్యనారాయణ-zee telugu aarogyame mahayogam special episode on international yoga day 2024 by manthena satyanarayana raju ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yoga Day: యోగా ప్రాముఖ్యతను తెలిపే స్పెషల్ పోగ్రామ్.. A-z యోగాసనాలతో మంతెన సత్యనారాయణ

Yoga Day: యోగా ప్రాముఖ్యతను తెలిపే స్పెషల్ పోగ్రామ్.. A-Z యోగాసనాలతో మంతెన సత్యనారాయణ

Sanjiv Kumar HT Telugu
Jun 20, 2024 01:25 PM IST

International Yoga Day 2024 Zee Telugu Manthena Satyanarayana: అంతర్జాతియ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాసనాల ప్రముఖ్యతను తెలిపే ప్రత్యేక కార్యక్రమాన్ని జీ తెలుగు అందిస్తోంది. ఇందులో మంతెన సత్యనారాయణ ఏ టు జడ్ యోగాసనాలు నేర్పించనున్నారు.

యోగా ప్రాముఖ్యతను తెలిపే స్పెషల్ పోగ్రామ్.. A-Z యోగాసనాలతో మంతెన సత్యనారాయణ
యోగా ప్రాముఖ్యతను తెలిపే స్పెషల్ పోగ్రామ్.. A-Z యోగాసనాలతో మంతెన సత్యనారాయణ

International Yoga Day 2024: తెలుగు టెలివిజన్ పరిశ్రమలోని ప్రముఖ ఛానళ్లలో ఒకటైన జీ తెలుగు నిరంతరం వైవిధ్యమైన వినోదాత్మక ఫిక్షన్, నాన్-ఫిక్షన్ కార్యక్రమాలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రేక్షకులను మెప్పించే వినోద కార్యక్రమాలతో పాటు విజ్ఞానం, ఆరోగ్యంపైనా దృష్టిసారిస్తూ పలు ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తోంది.

ప్రత్యేక ఎపిసోడ్

ప్రతిరోజూ ఉదయం ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంతో ఆరోగ్యాన్ని పెంపొందించే సలహాలు సూచనలు అందిస్తున్న జీ తెలుగు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఎపిసోడ్​తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్నపూర్ణ (Anchor Annapurna) వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు శిరీష నేర్పించే A-Z యోగాసనాలతోపాటు మంతెన సత్యనారాయణ (Manthena Satyanarayana) ప్రత్యేక సూచనలతో ప్రత్యేక ఎపిసోడ్​ ఆద్యంతం ఉపయుక్తంగా ఉండనుంది.

ఆకట్టుకుంటోన్న ప్రోమో

ఆరోగ్యమే మహాయోగం (Aarogyame Mahayogam) యోగా డే స్పెషల్​ ఎపిసోడ్‌ను జూన్​ 21 శుక్రవారం ఉదయం 8:30 గంటలకు జీ తెలుగులో (Zee Telugu Tv Channel) ప్రసారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతోంది. ఆరోగ్యవంతమైన జీవనానికి (Healthy Lifestyle) అవసరైన విశేషాలతో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో యోగా దినోత్సవం సందర్భంగా మంతెన సత్యనారాయణ పిల్లలకు యోగాసనాల ప్రాముఖ్యతను బోధించనున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

యోగాసనాలతో కూడిన ప్రత్యేక నృత్యంతో ఈ ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. ఈ ఎపిసోడ్​కి ప్రత్యేక అతిథిగా ప్రముఖ యోగా గురువు శిరీష హజరై తన ఫిట్​నెస్​ జర్నీ, సాధించిన విజయాలు, తన రోజూవారి ఆహారపు అలవాట్లు, ఆరోగ్య రహస్యాలను పంచుకోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తారు.

20 మంది నిరుపేద చిన్నారులకు

ఆమె క్రమం తప్పకుండా చేసే పనులు, డైట్​ ప్లాన్ (Diet Plan), అభిరుచులు, అలవాట్లను ప్రేక్షకులతో పంచుకోవడంతోపాటు 20 మంది నిరుపేద చిన్నారులకు యోగా నేర్పించనున్నారు. గత 15 ఏళ్లుగా నిరుపేద చిన్నారులకు యోగా నేర్పిస్తున్న శిరీష.. లక్షలాది మందికి ఆరోగ్యాన్ని అందించడంలో ఆమె చేసిన కృషి అనిర్వచనీయం.

వరల్డ్ మ్యూజిక్ డే 2024

ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పలుఅంశాల మేళవింపుగా ఈ ఎపిసోడ్​ అందరికీ ఉపయోగపడనుంది. అంతేకాదు, జూన్​ 21 ప్రపంచ సంగీత దినోత్సవం (World Music Day 2024) సందర్భంగా 14 ఏళ్ల మాన్విక వినిపించిన వేణుగానం ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీ తెలుగు అందిస్తున్న ఆరోగ్యమే మహాయోగం ప్రత్యేక ఎపిసోడ్​ని ఆస్వాదించాలని జీ తెలుగు కోరుకుంటోంది.

Whats_app_banner