Kajal Aggarwal: ఎన్టీఆర్ కోసమే ఆ సినిమాలో ఐటెంసాంగ్ చేశా - కాజల్ కామెంట్స్ వైరల్
Kajal Agarwalపెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్‌సినిమాలు మాత్రమే చేయాలని తన భర్త ఎలాంటి రూల్ పెట్టలేదని కాజల్ అన్నది. కెరీర్‌తో పాటు గౌతమ్ కిచ్లూతో ప్రేమాయణం, పెళ్లిపై అలీతో సరాదాగా షోలో కాజల్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ షో ప్రోమో వైరల్ అవుతోంది.
Kajal Agarwal: పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలను తగ్గించిన కాజల్ అగర్వాల్ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. తెలుగులో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న సత్యభామ మూవీ మే 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో కాజల్ బిజీగా ఉంది.
అలీతో సరదాగా ప్రోమో...
సత్యభామ ప్రమోషన్స్‌లో భాగంగా కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి కాజల్ గెస్ట్‌గా వచ్చింది. ఈ ఎపిసోడ్ తాలూకు ప్రోమో రిలీజైంది. ఈ షోలో గౌతమ్ కిచ్లూతో తన ప్రేమాయణం, పెళ్లితో పాటు కెరీర్‌పై కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది
స్ట్రాంగ్ ఫిమేల్ రోల్స్ ఇష్టం...
పెళ్లి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు...అలాంటి సినిమాలే చేయమని మీ భర్త రూల్‌పెట్టాడా అని కాజల్‌ను అలీ అడిగాడు. సినిమాల విషయంలో తన భర్త ఎలాంటి రూల్స్ విధించలేదని ఈ ప్రశ్నకు కాజల్ సమాధానం ఇచ్చింది. స్ట్రాంగ్, పవర్‌ఫుల్ ఫిమేల్ క్యారెక్టర్స్ చేయడం అంటే తనకు ఇష్టమని, తెలుగులో సత్యభామతో కొంత వరకు ఆ కోరిక తీరిందని కాజల్ అగర్వాల్ అన్నది.
యాక్షన్ తరహాలో విలన్స్‌ను కొట్టే పాత్రలు చేయాలనే చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానని...సత్యభామ అంగీకరించడానికి అది ఓ కారణమని కాజల్ అన్నది. సత్యభామ కు సీక్వెల్‌గా సత్యభామ 2 కూడా చేసే అవకాశం ఉందని వెల్లడించింది. గౌతమ్ కిచ్లూతో తనది పెద్దలు కుదుర్చిన ప్రేమ వివాహమని కాజల్ అన్నది. గౌతమ్‌తో పదేళ్లుగా పరిచయం ఉందని, లాక్‌డౌన్ టైమ్‌లోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యామని చెప్పింది.
ఎన్టీఆర్ కోసమే...
జనతా గ్యారేజ్‌లో ఐటెంసాంగ్ చేయడానికి కారణం ఏమిటని అలీ అడిగిన ప్రశ్నకు కాజల్ ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. బ్యానర్, పెద్ద డైరెక్టర్, రెమ్యునరేషన్ గురించి ఆలోచించి ఐటెంసాంగ్ చేయలేదని, కేవలం ఎన్టీఆర్ కోసమే ఆ పాటలో నటించడానికి ఒప్పుకున్నానని కాజల్ అన్నది.
కాలేజీ డేస్‌లో తనకు వందకుపైనే లవ్ లెటర్స్ వచ్చాయని, ఆ లెటర్స్ చూసి ఎవరిని కొట్టలేదని, ఎవరిపై కోపగించుకోలేదని కాజల్ అన్నది. కాలేజీ డేస్‌తో తనను పొగుడుతూ ఓ యువకుడు రాసిన లవ్ లెటర్‌కు తెగ ఇంప్రెస్ అయ్యానని కాజల్ చెప్పింది.
లక్ష్మీకళ్యాణం ఆడిషన్స్...
లక్ష్మీకళ్యాణం తన కెరీర్‌లో ఫస్ట్ అటెండ్ అయినా ఆడిషన్ అని, ఆ ఆడిషన్స్‌లో ఏడవమని తేజ అన్నాడని, కారణం లేకుండా ఏడవడం కష్టం కావడంతో ఏం చేయాలో అర్థం కాలేదని, నాన్న నాతో కావాలనే గట్టిగా మాట్లాడటంతో కన్నీళ్లు పెట్టుకున్నాని కాజల్ అన్నది. అలీతో సరదాగా ప్రోమోలో కాజల్ కెరీర్ కు చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
ఇండియన్ 2
ప్రస్తుతం సత్యభామతో పాటు కమల్‌హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2లో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇండియన్ మూవీ మూవీ జూన్‌లో రిలీజ్ కాబోతోంది. సత్యభామతో పాటు ఇండియన్ 2లోనూ కాజల్ యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ చేస్తోన్నట్లు సమాచారం.