The Delhi Files: నా సినిమాలో బిగ్ స్టార్స్ ఉండరు - ది ఢిల్లీ ఫైల్స్ మూవీపై డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కామెంట్స్
The Delhi Files: ది కశ్మీర్ ఫైల్స్ ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి మరో వివాదాస్పద కథాంశంతో సినిమా చేయబోతున్నాదు. ఢిల్లీ ఫైల్స్ పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది.
The Delhi Files: బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కశ్మీర్ ఫైల్స్ మూవీ కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. 1990లో కశ్మీరి పండిట్స్ ఊచకోత నేపథ్యంలో వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను రూపొందించారు. ఇరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కశ్మీర్ ఫైల్స్ మూవీ దేశవ్యాప్తంగా 350 కోట్లకు వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా ఈ మూవీ నిలిచింది.
కశ్మీరి పండిట్ల మారణ కాండను ఓ వర్గం కోణం నుంచే చూపించారంటూ కొందరు ఈ మూవీపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ది కశ్మీర్ ఫైల్స్ మూవీని నిషేదించాలంటూ డిమాండ్ చేశారు.ది కశ్మీర్ ఫైల్స్ మూవీని అభిషేక్ అగర్వాల్, అర్చన అగర్వాల్, ,పల్లవి జోషిలతో కలిసి వివేక్ అగ్నిహోత్రి నిర్మించాడు. టాలీవుడ్‌లో పలు సినిమాలు ప్రొడ్యూస్ చేసిన అభిషేక్ అగర్వాల్ ది కశ్మీర్ ఫైల్స్‌తోనే బాలీవుడ్‌లోకి ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇచ్చాడు.
ది ఢిల్లీ ఫైల్స్...
కాగా కశ్మీర్ ఫైల్స్ తర్వాత మరో వివాదాస్పన కథాంశంతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి ది ఢిల్లీ ఫైల్స్ అనే పేరును ఖరారు చేశారు. చాలా రోజుల క్రితమే ఢిల్లీ ఫైల్స్ మూవీని అనౌన్స్‌చేశారు. టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా ది ఢిల్లీ ఫైల్స్ షూటింగ్, రిలీజ్ డేట్‌పై డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు.
నెక్స్ట్ ఇయర్ రిలీజ్...
ఏడాదే ఢిల్లీ ఫైల్స్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించాడు. వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేస్తామని చెప్పాడు. ఈ మూవీలో బిగ్ స్టార్స్ ఎవరూ ఉండరని, బిగ్ కంటెంట్ మాత్రమే ఉంటుందని తన ట్వీట్‌లో వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నాడు. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్‌ను ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ రీట్వీట్ చేశాడు. ఢిల్లీ ఫైల్స్ మూవీ గురించి డైరెక్టర్‌తో పాటు ప్రొడ్యూసర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
సిక్కు ప్రజల ఊచకోత...
1984లో సిక్కు ప్రజలపై సాగిన దౌర్జన్యకాండ, అల్లరను ది ఢిల్లీ ఫైల్స్ మూవీలో చూపించబోతున్నట్లు సమాచారం. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సిక్కు బాడీ గార్డ్స్ చేతిలో హత్యకు గురైంది. దాంతో సిక్కులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. ఈ హింసలో దాదాపు ఇరవై వేల మందికిపైగా సిక్కులు చనిపోయారు. ఢిల్లీలోనే ఐదు వేల మంది సిక్కులు మరణించారు. ఈ అల్లర్ల కారణంగా సిక్కులు ఎదుర్కొన్న సంఘర్షణను ది ఢిల్లీఫైల్స్ మూవీలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చూపించబోతున్నట్లు సమాచారం. సిక్కు అల్లరకు సంబంధించి ఢిల్లీ పోలీసుల రికార్డుల్లో ఉన్న సమాచారం ఆధారంగానే ఈ మూవీని తెరకెక్కిస్తోన్నట్లు ప్రకటించాడు.
త్వరలోనే రివీల్...
ది ఢిల్లీ ఫైల్స్ సినిమాలో మిథున్ చక్రవర్తి, అంకిత్ బిస్త్, పునీత్ ఇస్పార్‌తో పాటు పలువురు బాలీవుడ్ ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషించనున్నారు. వారు ఎవరన్నది త్వరలోనే రివీల్ చేస్తామని సినిమా మేకర్స్ ప్రకటించారు.
ది కశ్మీర్ ఫైల్స్ తర్వాత ది వ్యాక్సిన్ వార్ పేరుతో ఓ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు వివేక్ అగ్నిహోత్రి. నానా పటేకర్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.