The Vaccine War : బాలీవుడ్‌లోకి కాంతార హీరోయిన్.. వివేక్ అగ్నిహోత్రి సినిమాలో ఛాన్స్-kantara actress sapthami gowda play role in vivek agnihotri new movie the vaccine war ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Vaccine War : బాలీవుడ్‌లోకి కాంతార హీరోయిన్.. వివేక్ అగ్నిహోత్రి సినిమాలో ఛాన్స్

The Vaccine War : బాలీవుడ్‌లోకి కాంతార హీరోయిన్.. వివేక్ అగ్నిహోత్రి సినిమాలో ఛాన్స్

Anand Sai HT Telugu

Sapthami Gowda : 'కాంతార' హిరోయిన్ సప్తమి గౌడకు మంచి డిమాండ్ వచ్చింది. కాంతార సక్సెస్ తో ఆమె కూడా పాపులర్ అయింది. ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రానున్న 'ది వ్యాక్సిన్ వార్' సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

కాంతార సినిమా హీరోయిన్

నటి సప్తమి గౌడ(sapthami gowda) కన్నడ చిత్రం 'కాంతార'తో భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది. అయితే ఆమె తదుపరి సినిమా ఏంటనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దానికి తెర పడింది. సప్తమి గౌడ బాలీవుడ్‌(Bollywood)లోకి అడుగుపెడుతోంది. 'ది కాశ్మీర్ ఫైల్స్'(The Kashmir Files) చిత్రానికి దర్శకత్వం వహించిన వివేక్ అగ్నిహోత్రి కొత్త చిత్రంలో సప్తమి గౌడ నటిస్తుంది . ఈ చిత్రానికి 'ది వ్యాక్సిన్ వార్'(The Vaccine War) అని పేరు పెట్టారు . వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమా షూటింగ్‌ని ఇప్పటికే ప్రారంభించాడు. హైదరాబాద్(Hyderabad)లో జరగనున్న షూటింగ్ లో సప్తమి గౌడ పాల్గొననున్నట్లు సమాచారం.

సప్తమి గౌడ నటించిన తొలి చిత్రం ‘పాప్‌కార్న్‌ మంకీ టైగర్‌’. ఆ సినిమాలో డాలీ ధనంజయ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. రెండో సినిమా ‘కాంతార’(Kantara)లో రిషబ్ శెట్టి(Rishab Shetty)తో నటించే అవకాశం వచ్చింది. అభిషేక్ అంబరీష్ నటిస్తున్న ‘కాళి’ మూడో సినిమా. 4వ సినిమా ద్వారా సప్తమి గౌడ నేరుగా బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. దీంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా విజయం తర్వాత వివేక్ అగ్నిహోత్రి(vivek agnihotri)కి మరింత పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌పై ఓ సినిమా చేస్తున్నాడు. నానా పటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సప్తమి గౌడకు ఆ ఆర్టిస్టులందరితో నటించే అవకాశం వచ్చింది.

సప్తమి గౌడ ‘కాంతార’ సినిమాలో లీలాగా నటించింది. ఆ పాత్రను ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమా అపూర్వ విజయం సాధించడంతో సప్తమి గౌడ(sapthami gowda)కు పలు ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ ఆమె అన్నింటినీ అంగీకరించలేదు. సరైనదని భావించే ప్రాజెక్టుల మీద మాత్రమే సంతకం చేస్తోంది.

‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాపై సినీ లవర్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. కోవిడ్(Covid) సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సప్తమి గౌడ పాత్ర గురించి మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది. ఇక కశ్మీర్ ఫైల్స్ తో వివేక్ అగ్నిహోత్సి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దీంతో వ్యాక్సిన్ వార్ పైనా భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత కథనం