Bichagadu 2 Release date: బిచ్చగాడు 2 విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?-vijay antony bichagadu 2 movie will release on may 19 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bichagadu 2 Release Date: బిచ్చగాడు 2 విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?

Bichagadu 2 Release date: బిచ్చగాడు 2 విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?

Maragani Govardhan HT Telugu
Apr 28, 2023 02:50 PM IST

Bichagadu 2 Release date: విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో అతడు నటించిన సరికొత్త చిత్రం బిచ్చగాడు2. 2016లో విడుదలైన బిచ్చగాడుకు సీక్వెల్‌గా రాబోతున్న ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

బిచ్చగాడు 2 రిలీజ్ డేట్ ఫిక్స్
బిచ్చగాడు 2 రిలీజ్ డేట్ ఫిక్స్

Bichagadu 2 Release date: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. 2016లో విడుదలైన ఈ మూవీ వసూళ్ల వర్షాన్ని కురిపించింది. తాజాగా ఈ మూవీ సీక్వెల్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఏప్రిల్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వల్ల ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. బిచ్చగాడు 2 ట్రైలర్‌తో పాటు విడుదల తేదీకి కూడా ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం.

బిచ్చగాడు 2 ట్రైలర్‌ను ఏప్రిల్ 29న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అలాగే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. మే 19న మూవీని విడుదల చేయాలని నిర్ణయించారు. తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

బిచ్చగాడు 2 సీక్వెల్‌ను తొలుత భారం, మెట్రో లాంటి సూపర్ హిట్లు అందించిన ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా.. అనంతరం కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై అతడే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

బిచ్చగాడు మొదటి భాగంలో కన్న తల్లి ఆరోగ్యం కోసం ఓ వ్యాపారవేత్త స్వామిజీ సలహాతో బిచ్చగాడుగా మారతాడు. 40 రోజుల పాటు దీక్ష చేసి తల్లి ప్రాణాలను కాపాడుకుంటాడు. అయితే ఈ సారి రానున్న సీక్వెల్‌లో విజయ్ ఆంటోని గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. మరి గ్యాంగ్‌స్టర్ బిచ్చగాడిగా ఎందుకు మారాడనేది చిత్ర కథాంశమని ప్రచారం జరుగుతోంది.

Whats_app_banner