Vijay Antony Health Update: ప్రమాదం నుంచి బయటపడిన విజయ్ ఆంటోనీ.. కోలుకుంటోన్న నటుడు
Vijay Antony Health Update: బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ సందర్భంగా విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఫలితంగా తీవ్రంగా గాయపడిని అతడిని ఆసుపత్రికి తరలించారు. తాజాగా ఆ ప్రమాదం నుంచి తాను బయటపడినట్లు విజయ్ ఆంటోనీ ట్విటర్ ద్వారా తెలియజేశారు.
Vijay Antony Health Update: బిచ్చగాడు సినిమాతో తమిళంలో కంటే కూడా తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఆ చిత్రం తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని అతడు అందుకోలేదనేది వాస్తవం. దీంతో ప్రస్తుతం విజయ్ ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలు కాగా.. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణలో విజయ్ ఆంటోనీ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి దాదాపు విషమంగా మారే వరకు వచ్చింది.
తాజాగా విజయ్ ఆంటోనీ అభిమానులుకు శుభవార్త చెప్పారు. అతడు తన సర్జరీని పూర్తి చేసుకుని గాయం నుంచి కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తన కోసం ప్రార్థించి, అండగా ఉన్నవారందరికీ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
"డియర్ ఫ్రెండ్స్. ప్రస్తుతం నేను సురక్షితంగా ఉన్నాను. మలేషియాలోని బిచ్చగాడు 2 షూటింగ్ సమయంలో నేను తీవ్రంగా గాయపడ్డాను. దవడ, ముక్కుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయం నుంచి సురక్షితంగా కోలుకున్నాను. నేను ఇప్పుడే ఓ పెద్ద శస్త్ర చికిత్సను పూర్తి చేయించుకున్నాను. వీలైనంత త్వరగా మీ అందరితో మాట్లాడతను. నాపై మీ మద్దతు, శ్రద్ధకు ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు.
మాతృక తమిళంలో ఈ సినిమాను పిచ్చైక్కరన్ 2 పేరుతో.. తెలుగులో బిచ్చగాడు పేరుతో రానుంది. కన్నడలో భిక్షుకా-2, మలయాళంలో భిక్షాక్కరన్-2 పేరుతో విడుదల కానుంది. బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు గతేడాదే ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకుని వేసవికి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
సంబంధిత కథనం