Vijay Antony Injured: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీకి ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు-vijay antony seriously injured in bichagadu 2 film shooting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Antony Injured: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీకి ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు

Vijay Antony Injured: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీకి ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు

Maragani Govardhan HT Telugu
Jan 17, 2023 07:31 AM IST

Vijay Antony Injured: బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీకి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం బిచ్చగాడు 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ హీరో.. ఈ మూవీ సెట్స్‌లో ప్రమాదానికి గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.

విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోనీ

Vijay Antony Injured: కోలీవుడ్ యాక్టర్ విజయ్ ఆంటోనీ(Vijay Antony) తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన బిచ్చగాడు సినిమా మాతృకలో కంటే ఇక్కడే అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బిచ్చగాడు-2ను రూపొందిస్తున్నారు విజయ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ వేసవిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణలో విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనను ఆసుపత్రి తరలించారని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాలా సమాచారం.

ప్రస్తుతం బిచ్చగాడు 2(Bichagadu 2) షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. ఇందులో భాగంగా విజయ్ ఆంటోనీ గాయపడ్డారట. దీంతో చిత్రబృందం వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అక్కడ పడవలో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా ప్రయాణిస్తున్న పడవ అదుపు తప్పి మరో బోట్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిటన్లు సమాచారం. ఈ ఘటనలో విజయ్‌కు గాయాల పాలయ్యాడట.

కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం విజయ్ ఆంటోనీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్‌కు ప్రమాదం జరగడంతో ఆయన కుటుంబ హుటాహుటిన మలేషియాకు బయల్దేరి వెళ్లినట్లు సమాచారం.

తమిళంలో పిచ్చైక్కరన్ 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో బిచ్చగాడు 2 పేరుతో రానుంది. కన్నడలో భిక్షుకా-2, మలయాళంలో భిక్షాక్కరన్-2 పేరుతో విడుదల కానుంది. బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ వస్తుందని గతేడాడే మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ దాదాపు పూర్తి కాగా.. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను ప్రారంభించనున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌ను విడుదల చేశారు హీరో విజయ్. ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బిచ్చగాడు 2 సీక్వెల్‌ను భారం, మెట్రో లాంటి సూపర్ హిట్లు అందించిన ప్రియ కృష్ణస్వామి తొలుత దర్శకత్వం వహించాల్సి ఉండగా.. అనంతరం ఆయన కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై అతడే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్