Kaikala Satyanarayana Death: కైకాల సత్యనారాయణ కన్నుమూత….
Kaikala Satyanarayana ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సానుభూతి తెలియ చేస్తున్నారు. వందలాది చిత్రాల్లో 60ఏళ్లకు పైగా ప్రేక్షకులను కైకాల అలరించారు.
Kaikala Satyanarayana సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కైకాల సత్యనారాయణ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణకు ఇంటి దగ్గరే చికిత్స అందిస్తున్నారు. రెండ్రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే ఆయన కన్ను మూశారు.
ఏడాది క్రితం కైకాల అస్వస్థతకు గురయ్యారు. మల్టిపుల్ ఆర్గన్ సమస్యలతో ఆయన విషమ పరిస్థితికి చేరుకున్నారు.ఆ తర్వాత మెల్లగా కోలుకున్నారు. ఆ తర్వాత ఆరోగ్యం మెరుగు పడటంతో ఇంటి వద్దే చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి నుంచి కోలుకున్న తర్వాత కైకాల సత్యనారాయణను చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు పరామర్శించారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత వైవిధ్యభరితమైన పౌరాణిక పాత్రల్ని పోషించిన నటుడిగా ప్రేక్షుకుల మన్ననలు పొందారు. 1996లో టీడీపీ ఎంపీగా బందరు పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు. కైకాల సత్యనారాయణ కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో జన్మించారు.1935 జులై 25న జన్మించిన కైకాల విద్యాభ్యాసం గుడ్లవల్లేరు, గుడివాడల్లో సాగింది. గుడివాడలో ఆయన డిగ్రీ పూర్తిచేశారు.
నటనపై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే పలు నటక ప్రదర్శనలు ఇఛ్చారు. సత్యానారాయణలో ఉన్న నటుడిని గుర్తించి ప్రముఖ నిర్మాణ డిఎల్ నారాయణ గుర్తించి సిపాయి కూతురు సినిమాలో అవకాశం ఇచ్చారు. పౌరాణికం, జానపదం, కమర్షియల్ ఇలా అన్ని జోనర్లలో సత్యనారాయణ నటించారు.ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంటేష్ వంటి నటుల చిత్రాల్లో కైకాల ప్రధాన పాత్రలు పోసించారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయన వివాహం జరిగింది. కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.కైకాల మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన అంత్య క్రియలు శనివారం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు.
60 సంవత్సరాల సినీజీవితంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించాడు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు. తన కెరీర్‌లో మొత్తం 777 సినిమాలలో కైకాల నటించారు. 28 పౌరాణిక చిత్రాలు, 51 జానపద చిత్రాలు, 9 చారిత్రక చిత్రాలలో కీలక పాత్ర పోషించారు. మొత్తం 200 మంది దర్శకులతో కైకాల పనిచేశారు. ఆయన నటించిన సినిమాలలో 223 సినిమాలు 100 రోజులు ఆడాయి. 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి. 10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. 10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడాయి.