OMG Teaser: అరుంధ‌తి అక్కవా...చంద్ర‌ముఖి చెల్లెలివా..ద‌య్యంతో వెన్నెల‌కిషోర్ కామెడీ - ఓఎమ్‌జీ టీజ‌ర్ రిలీజ్‌-vennela kishore nandita swetha oh manchi ghost movie teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Omg Teaser: అరుంధ‌తి అక్కవా...చంద్ర‌ముఖి చెల్లెలివా..ద‌య్యంతో వెన్నెల‌కిషోర్ కామెడీ - ఓఎమ్‌జీ టీజ‌ర్ రిలీజ్‌

OMG Teaser: అరుంధ‌తి అక్కవా...చంద్ర‌ముఖి చెల్లెలివా..ద‌య్యంతో వెన్నెల‌కిషోర్ కామెడీ - ఓఎమ్‌జీ టీజ‌ర్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
May 11, 2024 11:20 AM IST

OMG Teaser: వెన్నెల‌కిషోర్‌, నందితా శ్వేత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఓఎమ్‌జీ (ఓ మై ఘోస్ట్‌) మూవీ టీజ‌ర్ శ‌నివారం రిలీజైంది. హార‌ర్ అంశాల‌తో భ‌య‌పెడుతూనే ఈ టీజ‌ర్ న‌వ్విస్తోంది.

వెన్నెల‌కిషోర్‌ ఓఎమ్‌జీ మూవీ టీజ‌ర్
వెన్నెల‌కిషోర్‌ ఓఎమ్‌జీ మూవీ టీజ‌ర్

OMG Teaser: హారర్, కామెడీ సినిమాల‌కు టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీగా ముద్ర‌ప‌డింది. ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తూ భ‌య‌పెట్టిన సినిమాలు చాలా వ‌ర‌కు హిట్ట‌య్యాయి. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ నుంచి ఇటీవ‌ల విడుద‌లైన ఓం భీమ్ బుష్ వ‌ర‌కు ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తూ భ‌య‌పెట్టిన సినిమాలు చాలా వ‌ర‌కు హిట్ట‌య్యాయి.ప్రస్తుతం హారర్, కామెడీ జానర్లలో వచ్చే చిత్రాలకు ఇటు ఓటీటీ, అటు థియేటర్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ జాన‌ర్‌లో మ‌రో తెలుగు మూవీ ప్రేక్ష‌కుల్ని న‌వ్వంచేందుకు రెడీ అవుతోంది. అదే ఓఎమ్‌జీ (ఓ మంచి ఘోస్ట్) మూవీ.

వెన్నెల‌కిషోర్ హీరో...

ఓఎమ్‌జీ మూవీలో వెన్నెల‌కిషోర్‌, నందితాశ్వేత, ష‌క‌ల‌క శంక‌ర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. శ‌నివారం ఓఎమ్‌జీ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. హార‌ర్ అంశాల‌తో మొద‌లైన ఈ చివ‌ర‌కు కామెడీతో ఎండ్‌చేశారు. ‘పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది’ అనే డైలాగ్‌తో టీజర్ ఓపెన్ అయింది. ‘ఒసేయ్ నువ్వు అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖి చెల్లివైనా.. కాశ్మోరా లవర్‌వైనా, కాంచన కజిన్‌వైనా’ అంటూ వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది.. ‘నేను మోహిని పిశాచి మోహం తీర్చా..కామిని పిశాచి కామం తీర్చా.. శంకిని పిశాచి సంక నాకా.. సంక నాకించా’ అంటూ షకలక శంకర్ కామెడీతో అల‌రించారు.

నందితా శ్వేత ద‌య్యం...

ఈ టీజ‌ర్‌లో నందితా శ్వేత ద‌య్యంగా క‌నిపిస్తోంది. హార‌ర్‌, కామెడీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఓ పురాత‌న బంగ‌ళాలో అడుగుపెట్టిన కొంత‌మందికి ఓ దెయ్యం కార‌ణంగా ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డార‌నే పాయింట్‌తో ఈ సినిమా సాగ‌నున్న‌ట్లు టీజ‌ర్‌లో చూపించారు. రివేంజ్ అంశాల‌ను ట‌చ్ చేశారు. ఆండ్రూ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ ఆర్ఆర్ టీజర్‌లో ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్‌...

ఓఎమ్‌జీ మూవీలో న‌వి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓఎమ్‌జీ మూవీకి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. డా.అబినికా ఇనాబతుని నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అతిత్వరలో ఓఎమ్‌జీ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

హీరోగా...క‌మెడియ‌న్‌గా...

ఓ వైపు క‌మెడియ‌న్‌గా క‌నిపిస్తూనే హీరోగా బిజీగా ఉన్నాడు వెన్నెల‌కిషోర్‌. అత‌డు హీరోగా న‌టించిన చారి 111 ఓటీటీలో చ‌క్క‌టి ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకున్న‌ది. వెన్నెల‌కిషోర్ క‌థానాయ‌కుడిగా శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ పేరుతో ఓ డిటెక్టివ్ కామెడీ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. నందితా శ్వేత ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో ఎక్కువ‌గా హార‌ర్ సినిమాలు చేసింది.ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాతో పాటు ప‌లు సినిమాల్లో ద‌య్యం పాత్ర‌ల్లో క‌నిపించింది.

IPL_Entry_Point