Ranam Review: రణం రివ్యూ - సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లతో సాగే నందితా శ్వేత మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Ranam Review:వైభవ్, నందితాశ్వేత, తాన్యహోప్ హీరోహీరోయిన్లుగా నటించిన రణం మూవీ కోలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Ranam Review: వైభవ్, నందితాశ్వేత, తాన్యహోప్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం రణం ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు షరీఫ్ దర్శకత్వం వహించాడు. థియేటర్లలో కమర్షియల్ సక్సెస్‌గా నిలిచిన ఈ మూవీ ఎలా ఉందంటే?
ఫేస్ రీ కన్‌స్ట్రక్షన్ ఆర్టిస్ట్...
శివ (వైభవ్) క్రైమ్ సీన్ రైటర్ కమ్ ఫేస్ రీ కన్‌స్ట్రక్షన్ ఆర్టిస్ట్. ముఖాలు గుర్తుపట్టకుండా జరిగిన హత్యలకు సంబంధించిన కేసులను సాల్వ్ చేయడంలో పోలీసులకు సాయపడుతుంటాడు. ఓ యాక్సిడెంట్‌లో అతడు ప్రేమించి పెళ్లిచేసుకున్న కావ్య చనిపోతుంది.
ఆ ప్రమాదంలోనే శివ తలకు దెబ్బతగులుతుంది. ఏదైనా అనూహ్య సంఘటనల ఎదురైతే కొద్ది క్షణాల పాటు ఫ్రీజింగ్ అయిపోతాడు. ఓ రోజు మాధవరం పోలీస్‌స్టేషన్ ముందు ఓ డెడ్‌బాడీకి సంబంధించిన కాళ్లు మాత్రమే దొరుకుతాయి. అలాంటి బాక్సులు సిటీలో మరో రెండు చోట్ల కనబడతాయి. మృతదేహానికి సంబంధించిన భాగాలను కాల్చివేసి ఆ బాక్సులలో పెడతారు. ప్రతి బాక్స్‌లో సగం కాలిన ప్లాస్టిక్ మాస్క్ ఉంటుంది. ఈ కేసు మీడియాలో హైలైట్‌గా మారుతుంది. పోలీసులు ఈ మర్డర్ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుంటారు.
ఈ కేసును ఇన్వేస్టిగేట్ చేస్తున్న ఎస్ఐ రాజేంద్రన్ కనిపించకుండాపోతాడు. దాంతో రాజేంద్రన్ స్థానం ఇందూజ (తాన్య హోప్) ఈ కేసును టేకాప్ చేస్తుంది. శివ సహాయంతో ఇందూజ ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది. బాక్స్‌లలో దొరికిన డెడ్‌బాడీలు ఎవరివి? తన తెలివితేటలతో అసలైన కిల్లర్‌ను శివ ఎలా పట్టుకున్నాడు?
బాక్స్‌లలో దొరికిన డెడ్‌బాడీలకు కల్కి (నందితా శ్వేత) అనే మహిళకు ఉన్న సంబంధమేమిటి? పోలీసుల రికార్డుల్లో చనిపోయిన కల్కి ఎందుకు ఈ హత్యలు చేసింది? తన కూతురికి జరిగిన అన్యాయంపై కల్కి ఎస్ఐ రాజేంద్రన్‌తో ఓ హాస్పిటల్ ఓనర్స్‌ఫై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది? ఆమె రివేంజ్‌కు శివ ఏ విధంగా సహాయం చేశాడు?కల్కి కూతురి చావుకు శివకు ఏమైనా సంబంధం ఉందా? తనకున్న సమస్యను అధిగమించి కల్కికి కేసును శివ ఎలా ఎండ్ చేశాడు? అన్నదే ఈ రణం మూవీ కథ.
మర్డర్ మిస్టరీ మూవీ...
మర్డర్ మిస్టరీ సినిమాలు చాలా వరకు ఒకే ఫార్మెట్‌లో సాగుతాయి. చిన్నపాటి ఆధారం కూడా లేని ఓ పెద్ద క్రైమ్‌ను హీరో ఎలా సాల్వ్ చేశాడు, క్లైమాక్స్‌లో అసలైన విలన్‌ను ఎలా పట్టుకున్నాడనే పాయింట్ చుట్టే తిరుగుతుంటాయి. ఈ కథల్లో ఫార్మెట్ ఒకటే అయినా కథ, కథనాల్ని ఆసక్తికరంగా రాసుకోవడం ముఖ్యం.
ప్రతి పది నిమిషాలకు ఓ ట్విస్ట్‌తో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేయాలి. విలన్ ఎవరూ అన్నది క్లైమాక్స్ వరకు ఆడియెన్స్ ఊహలకు అందకూడదు. విలన్‌ను పట్టుకోవడానికి హీరో వేసే ఎత్తులు, వాటిని విలన్ తిప్పికొట్టే సీన్స్‌ను ఎంత ఎంగేజింగ్‌గా రాసుకుంటే ఈ కథలు అంత ఆసక్తికరంగా ఉంటాయి. రణం ఆడియెన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లు, టర్న్‌లతో సాగే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.
రివేంజ్ డ్రామా...
రివేంజ్ డ్రామా చుట్టూ మర్డర్ మిస్టరీ డ్రామాను అల్లుకుంటూ దర్శకుడు షరీఫ్ ఈ కథను రాసుకున్నాడు. ఇలాంటి కథల్లో చాలా వరకు హీరోలు పోలీసులు, డిటెక్టివ్‌లుగా కనిపిస్తుంటారు.. కానీ ఈ సినిమాలో ఫేస్ రీ కన్‌స్ట్రక్షన్ ఆర్టిస్ట్ అనే కొత్త నేపథ్యాన్ని దర్శకుడు ఎంచుకున్నాడు. తనకున్న వ్యక్తిగత సమస్యను అధిగమిస్తూ హీరో సీరియల్ మర్డర్స్ వెనకున్న క్రైమ్‌ను ఎలా సాల్వ్ చేశాడన్నది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.
సెకండాఫ్ క్యూరియాసిటీ...
హీరో ఓ క్రైమ్ కేసును సాల్వ్ చేసే సీన్‌తోనే ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డెబ్‌బాడీ పార్ట్స్ తో కూడిన బాక్స్‌లు దొరకడం, ఆ కేసును ఇన్వేస్టిగేట్ చేస్తోన్న పోలీస్ ఆఫీసర్ మిస్సవ్వడం నుంచి ఈ సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. కైలాసం అనే వ్యక్తి ఈ మర్డర్స్ వెనకున్నాడని హీరో కనిపెట్టేలోపు అతడు హత్యకు గురవ్వడంతో సెకండాఫ్‌లో ఏం జరుగుతుందోననే క్యూరియాసిటీని డైరెక్టర్ రేకెత్తించాడు.
కల్కి క్యారెక్టర్...
కల్కి అనే క్యారెక్టర్‌ను స్క్రీన్‌పైకి తీసుకొచ్చాడు డైరెక్టర్. తనకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తూ ఈ మర్డర్స్ లింక్ చేయడం థ్రిల్లింగ్‌ను పంచుతుంది. క్లైమాక్స్‌లో గ్యాప్ లేకుండా ఒకదాని వెంట మరొకటి ట్విస్ట్‌లు వస్తూనే ఉంటాయి. కల్కికి శివ ఎందుకు సాయం చేశాడన్నదానిని కన్వీన్సింగ్ దర్శకుడు చూపించాడు. విలన్ పాత్రలకు సంబంధించిన నేఫథ్యాన్ని గతంలో వచ్చిన సైకో, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా రాసుకున్నాడు డైరెక్టర్.
లాజిక్‌లకు దూరంగా...
కథ బాగున్నా హీరో ఈజీగా క్రైమ్‌లను సాల్వ్ చేయడం లాజిక్‌లకు దూరంగా అనిపిస్తుంది. ఇందూజ క్యారెక్టర్‌ను బలంగా రాసుకోలేదు. హడావిడి చేస్తూ టైమ్‌పాస్ చేయడం తప్పితే ఆమె చేసిందేమి లేదు.
హడావిడి మాత్రమే...
శివ పాత్రలో వైభవ్ ఒదిగిపోయాడు. వ్యక్తిగత జీవితం తాలూకు బాధను, క్రైమ్ సాల్వ్ చేయడంలో అతడి ఇంటిలిజెన్స్ రెండింటిని బ్యాలెన్స్‌డ్‌గా చూపించాడు. ఎమోషనల్ రోల్‌లో సెటిల్డ్ యాక్టింగ్ కనబరిచాడు. నందితా శ్వేతకు సెకండాఫ్‌లోనే కనిపిస్తుంది. చిన్న రోల్ అయినా కథకు ఆమె కీలకంగా నిలుస్తుంది. తాన్య హోప్ పోలీస్ పాత్రలో తగ్గట్లుగా కనిపించింది. క్యారెక్టర్ బలంగా రాసుకోలేకపోవడంతో యాక్టింగ్‌లో తేలిపోయింది.
క్రైమ్ మూవీ లవర్స్‌కు...
రణం అరమ్ తవ్రల్ డిఫరెంట్ పాయింట్‌తో కూడిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాల్ని ఇష్టపడే ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది.