Vanitha Vijaykumar: నాలుగో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్.. ముగ్గురు మాజీ భర్తలు, ముగ్గురు పిల్లలు.. ఇప్పుడిలా..-vanitha vijaykumar ready for fourth marriage actress marrying choreographer robert ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vanitha Vijaykumar: నాలుగో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్.. ముగ్గురు మాజీ భర్తలు, ముగ్గురు పిల్లలు.. ఇప్పుడిలా..

Vanitha Vijaykumar: నాలుగో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్.. ముగ్గురు మాజీ భర్తలు, ముగ్గురు పిల్లలు.. ఇప్పుడిలా..

Hari Prasad S HT Telugu
Oct 02, 2024 08:02 PM IST

Vanitha Vijaykumar: ఓ స్టార్ హీరోయిన్ నాలుగో పెళ్లికి రెడీ అయిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే ముగ్గురు మాజీ భర్తలు, ముగ్గురు పిల్లలున్న ఆ నటి ఓ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడి అతనితో నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

నాలుగో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్.. ముగ్గురు మాజీ భర్తలు, ముగ్గురు పిల్లలు.. ఇప్పుడిలా..
నాలుగో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్.. ముగ్గురు మాజీ భర్తలు, ముగ్గురు పిల్లలు.. ఇప్పుడిలా..

Vanitha Vijaykumar: హీరోయిన్ నాలుగో పెళ్లి అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా సెలబ్రిటీలకు ఈ డేటింగ్స్, బ్రేకప్స్, డివోర్స్ అనేవి సాధారణమే అనిపించినా.. ఈ హీరోయిన్ వ్యవహారం మాత్రం అస్సలు అంతుబట్టదు. ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకొని, ముగ్గురు పిల్లలకు తల్లయిన ఈమె.. నాలుగో పెళ్లికి రెడీ అవుతుండటం కచ్చితంగా విశేషమే.

వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లి?

తమిళంతోపాటు తెలుగులోనూ పేరున్న నటీనటులు మంజుల, విజయ్ కుమార్. ఒకప్పుడు రెండు సినిమా ఇండస్ట్రీల్లోనూ తమ నటనతో అభిమానులను సంపాదించుకున్నారు ఈ భార్యాభర్తలు. వీళ్ల కూతురు శ్రీదేవి ఒకప్పుడు ప్రభాస్ తొలి మూవీ ఈశ్వర్ లో నటించింది. ఇప్పుడామె సోదరి వనితా విజయ్ కుమార్ వార్తల్లో నిలుస్తోంది.

ఈమె కూడా ఓ నటే. ముఖ్యంగా తమిళ సినిమాల్లో నటించిన వనితా.. సినిమాల కంటే వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కొరియోగ్రాఫర్ రాబర్ట్ ను ఆమె అక్టోబర్ 5న పెళ్లి చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి ఉంటున్నారు. ఇక పెళ్లితో ఒక్కటవ్వాలని భావిస్తున్నారు.

మూడు పెళ్లిళ్లు.. ముగ్గురు పిల్లలు

వనితా విజయ్ కుమార్ వ్యక్తిగత జీవితం వివాదాలమయం. ఆమె ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకొని అందరితోనూ విడాకులు తీసుకుంది. మొదట 2000వ సంవత్సరంలో ఆకాశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఓ బాబు, పాప జన్మించారు. ఆ తర్వాత విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు.

2007లో ఆమె ఆనంద్ జయదర్శన్ అనే మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వీళ్లకు కూడా ఓ కూతురు పుట్టింది. ఈ ఇద్దరూ 2012లో విడిపోయారు. తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న ఆమె.. 2020లో పీటర్ పాల్ అనే ఓ ఫొటోగ్రాఫర్ ను మూడో పెళ్లి చేసుకుంది. అతనితోనూ ఎక్కువ కాలం కలిసి ఉండలేదు.

వీళ్లు విడిపోయిన కొన్నాళ్ల తర్వాత అనారోగ్యంతో పీటర్ మరణించాడు. ఇక ఇప్పుడు కొరియోగ్రాఫర్ రాబర్ట్ ను వనిత నాలుగో పెళ్లి చేసుకోబోతుండటం విశేషం. ఇప్పుడీ వార్త తమిళనాట సంచలనంగా మారింది. ఓ హీరోయిన్ ఇలా వరుస పెళ్లిళ్లు చేసుకుంటుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.