Bhagavanth Kesari vs Skanda TRP: భగవంత్ కేసరి, స్కంద సినిమాలకు టీవీలో సూపర్ రెస్పాన్స్.. టీఆర్పీలో దేనిది పైచేయి?
Bhagavanth Kesari vs Skanda TRP Ratings: భగవంత్ కేసరి, స్కంద సినిమాలు ఇటీవలే టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యాయి. వీటికి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీఆర్పీ రేటింగ్‍ల వివరాలు వచ్చాయి.
Bhagavanth Kesari vs Skanda TRP: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా థియేటర్లలో సూపర్ హిట్ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలోకి వచ్చింది. మంచి హిట్ సాధించింది. ఇటీవలే ఈ చిత్రం టెలివిజన్‍లో ప్రీమియర్ అయింది. టీవీ ఛానెల్‍లో ప్రసారమైంది. టీవీలోనూ భగవంత్ కేసరి మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీఆర్పీ లెక్కలు బయటికి వచ్చాయి.
అదరగొట్టిన భగవంత్ కేసరి
భగవంత్ కేసరి సినిమా జీ తెలుగు ఛానెల్‍లో జనవరి 28వ తేదీన తొలిసారి ప్రసారమైంది. దీంతో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. భగవంత్ కేసరి సినిమా 9.36 టీఆర్పీ దక్కించుకుంది. మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటించారు. శ్రీలీల కీలకపాత్ర పోషించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విజయ్ లక్ష్మి అలియాజ్ విజ్జి (శ్రీలీల)ను ధైర్యవంతురాలిగా చేసి.. ఆర్మీకి పంపాలని భగవంత్ కేసరి (బాలకృష్ణ) ప్రయత్నించడం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది.
భగవంత్ కేసరి మూవీలో చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‍గా నటించారు. ఆడుకాలమ్ నరేన్, శరత్ కుమార్, రవిశంకర్, బహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లతో ఈ చిత్రం బ్లాక్‍బాస్టర్ అయింది.
స్కంద ఇలా..
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన స్కంద చిత్రం గతేడాది సెప్టెంబర్‌లో థియేటర్లలో రిలీజ్ అయింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఓవర్ డోస్ యాక్షన్ సీన్లు ఉన్నా మెప్పించలేకపోయింది. అయితే, టీవీలో మాత్రం స్కంద సినిమాకు మోస్తరు స్పందనే వచ్చింది.
స్టార్ మా ఛానెల్‍లో స్కంద చిత్రం జనవరి 28వ తేదీన ప్రసారం అయింది. ఈ మూవీకి 8.11 టీఆర్పీ వచ్చింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రానికి.. టీవీలో మంచి రేటింగ్ దక్కించుకుంది.
స్కంద చిత్రంలో సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వ, ప్రిన్స్ సెసిల్, అజయ్ పుర్కర్, దగ్గుబాటి రాజా, ప్రభాకర్, బబ్లూ పృథ్విరాజ్ కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. కొన్నేళ్లుగా హిట్ కోసం చూస్తున్న రామ్‍కు స్కంద కూడా నిరాశే మిగిల్చింది. రామ్, శ్రీలీల డ్యాన్స్‌తో అదరగొట్టినా.. బోయపాటి శ్రీను కథనంపై మిక్స్డ్ టాక్ వచ్చింది.
మొత్తంగా, టీవీలో టీఆర్పీ పరంగా స్కందపై భగవంత్ కేసరి చిత్రం పైచేయి సాధించింది. 9.36 టీఆర్పీతో బాలయ్య మూవీ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న స్కంద కూడా పర్వాలేదనిపించింది.
ఓటీటీల్లో ఎక్కడ..
భగవంత్ కేసరి, స్కంద చిత్రాలు ఇప్పటికే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లలోనూ అందుబాటులో ఉన్నాయి. భగవంత్ కేసరి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. స్కంద మూవీ డిస్నీ+ హాట్‍స్టార్‌లో ఉంది.