Skanda 10 Days Collection: పుంజుకున్న స్కంద కలెక్షన్స్.. రావాల్సింది ఎక్కువే.. తప్పని కష్టాలు!-skanda movie 10 days worldwide box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Skanda 10 Days Collection: పుంజుకున్న స్కంద కలెక్షన్స్.. రావాల్సింది ఎక్కువే.. తప్పని కష్టాలు!

Skanda 10 Days Collection: పుంజుకున్న స్కంద కలెక్షన్స్.. రావాల్సింది ఎక్కువే.. తప్పని కష్టాలు!

Sanjiv Kumar HT Telugu
Oct 08, 2023 12:34 PM IST

Skanda Day 10 Collection: రామ్ పోతినేని స్కంద సినిమాకు మొన్నటివరకు కలెక్షన్స్ తగ్గినా.. వీకెండ్ కారణంగా మళ్లీ వసూళ్లు పుంజుకుంటున్నాయి. ఇలా స్కంద సినిమా 10 డేస్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

స్కంద మూవీ 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్
స్కంద మూవీ 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Skanda 10 Days WW Collection: ఉస్తాద్ రామ్, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన స్కంద సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 46.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. వాటిలో ఏరియాలా వారిగీ నైజాం రూ. 13 కోట్లు, సీడెడ్‍ రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‍లో 19.50 కోట్ల బిజినెస్ అయింది. ఇలా ఏపీ, తెలంగాణలో రూ. 41 కోట్ల బిజినెస్ కాగా..కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‍ 2.20 కోట్లుగా మార్కెట్ అయింది.

డే 10 కలెక్షన్స్

స్కంద చిత్రానికి వీకెండ్‌లో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. 9వ రోజున తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్‌, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు అన్ని ఏరియాలు కలుపుకుని రూ. 62 లక్షలు రాగా.. 10వ రోజు మాత్రం రూ. 76 లక్షల రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్‌గా స్కంద సినిమాకు 10వ రోజున రూ. 84 లక్షల షేర్, రూ. 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. థియేటర్లు తగ్గినా శనివారం కారణంగా స్కందకు ఆడియెన్స్ వెళ్లినట్లు తెలుస్తోంది.

ఏపీ తెలంగాణలో

స్కంద సినిమాకు 10 రోజుల్లో నైజాంలో రూ. 10.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.91 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.36 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.07 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.34 కోట్లు, గుంటూరులో రూ. 2.54 కోట్లు, కృష్ణాలో రూ. 1.43 కోట్లు, నెల్లూరులో రూ. 1.12 కోట్ల రాగా మొత్తంగా రూ. 26.05 కోట్ల షేర్, రూ. 43.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

10 రోజులకు కలిపి

స్కంద చిత్రానికి 10 రోజులు కలుపుకుని కర్ణాటకతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.61 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.89 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా రూ. 30.55 కోట్ల షేర్, రూ. 53.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. స్కంద సినిమా ఇప్పటిదాకా 65 శాతం కలెక్షన్స్ మాత్రమే రికవరీ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

స్కందకు కష్టాలు

రామ్, శ్రీలీల కాంబో స్కంద మూవీ రూ. 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. కానీ, ఇప్పటివరకు వచ్చింది రూ. 30.55 కోట్లు. అంటే ఇంకా ఈ సినిమాకు రూ. 16.45 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. గత రెండు రోజులుగా కలెక్షన్స్ పుంజుకుంటున్నాయి. మరి ఆదివారం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం స్కందకు కష్టాలు తప్పేలా లేవని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Whats_app_banner