Viswambhara Trisha: అఫీషియ‌ల్ - విశ్వంభ‌ర‌లో హీరోయిన్‌గా త్రిష ఫిక్స్ - 18 ఏళ్ల త‌ర్వాత‌ మెగాస్టార్‌తో రొమాన్స్‌-trisha to reunite with megastar chiranjeevi after 18 years for vishwambhara movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Viswambhara Trisha: అఫీషియ‌ల్ - విశ్వంభ‌ర‌లో హీరోయిన్‌గా త్రిష ఫిక్స్ - 18 ఏళ్ల త‌ర్వాత‌ మెగాస్టార్‌తో రొమాన్స్‌

Viswambhara Trisha: అఫీషియ‌ల్ - విశ్వంభ‌ర‌లో హీరోయిన్‌గా త్రిష ఫిక్స్ - 18 ఏళ్ల త‌ర్వాత‌ మెగాస్టార్‌తో రొమాన్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 05, 2024 10:54 AM IST

Viswambhara Trisha: విశ్వంభ‌ర‌ సినిమాలో హీరోయిన్‌గా త్రిష ఫిక్స‌యింది. విశ్వంభ‌ర సెట్స్‌లో త్రిష అడుగుపెట్టిన వీడియోను సోమ‌వారం చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

విశ్వంభర సెట్స్‌లోకి త్రిష‌ను ఆహ్వానిస్తోన్న చిరంజీవి
విశ్వంభర సెట్స్‌లోకి త్రిష‌ను ఆహ్వానిస్తోన్న చిరంజీవి

Viswambhara Trisha:విశ్వంభ‌ర‌లో హీరోయిన్ ఎవ‌ర‌నే స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోమ‌వారం చిరంజీవి అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశాడు. విశ్వంభ‌ర సినిమాలోకి త్రిష‌ను ఆహ్వానిస్తోన్న‌ట్లు చిరంజీవి తెలిపాడు. మూవీ సెట్స్‌లో త్రిష‌ అడుగుపెట్టిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

స్టాలిన్ త‌ర్వాత‌...

గ‌తంలో 2016లో చిరంజీవి హీరోగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ స్టాలిన్ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న హీరోయిన్‌గా క‌నిపించింది త్రిష‌. దాదాపు ప‌ద్దెనిమిదేళ్ల గ్యాప్ విశ్వంభ‌ర‌లో మ‌ళ్లీ చిరంజీవి, త్రిష జోడీక‌ట్ట‌బోతుండ‌టం గ‌మ‌నార్హం. ఆచార్య‌లో త్రిష హీరోయిన్‌గా న‌టించింది. త్రిష‌ను హీరోయిన్‌గా అధికారికంగా ప్ర‌క‌టించారు. షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఆచార్య నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు త్రిష అనౌన్స్‌చేసింది. త్రిష ప్ర‌క‌ట‌న అప్ప‌ట్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఆచార్య గొడ‌వ కార‌ణంగా చిరంజీవి, త్రిష మ‌ళ్లీ క‌లిసి సినిమా చేయ‌డం అనుమాన‌మేనంటూ ప్ర‌చారం జ‌రిగింది. విశ్వంభ‌ర సినిమాలో హీరోయిన్‌గా త్రిష న‌టించ‌నున్న‌ట్లు చిరంజీవి స్వ‌యంగా ప్ర‌క‌టించి ఈ పుకార్ల‌కు పుల్‌స్టాప్ పెట్టారు. త్రిష‌తో మ‌రో హీరోయిన్‌గా కూడా ఈ సినిమాలో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమె ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే ఫైన‌లైజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

బింబిసార త‌ర్వాత‌...

.ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న విశ్వంభ‌ర సినిమాకు బింబిసార ఫేమ్ వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బింబిసార బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సెకండ్ మూవీ ఇది. ఇటీవ‌లే విశ్వంభ‌ర‌ సెట్స్‌లో చిరంజీవి అడుగుపెట్టాడు. న‌వంబ‌ర్‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. హీరోహీరోయిన్లు లేకుండా కొన్ని కీల‌క‌మైన ఎపిసోడ్స్‌ను డైరెక్ట‌ర్ తెర‌కెక్కించాడు.

ఎనిమిదేళ్ల త‌ర్వాత రీఎంట్రీ...

విశ్వంభ‌ర‌తో ఎనిమిదేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి త్రిష రీఎంట్రీ ఇస్తోంది. చివ‌ర‌గా 2016లో నాయ‌కి సినిమా చేసింది త్రిష‌. ఆ త‌ర్వాత టాలీవుడ్‌కు దూర‌మైన త్రిష కోలీవుడ్‌పై ఫోక‌స్ పెట్టింది. లాంగ్‌గ్యాప్ త‌ర్వాత త‌మిళంలో లియోతో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకున్న‌ది. తెలుగులోను సేమ్ టైటిల్‌తో డ‌బ్ అయిన ఈ మూవీ నిర్మాత‌ల‌కు లాభాల‌ను మిగిల్చింది.

సంక్రాంతికి రిలీజ్‌...

విశ్వంభ‌ర సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌నుంది. 2025 జ‌న‌వ‌రి 10 రిలీజ్ కాబోతోంది. ఏడాది ముందే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేశారు. దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీని యూవీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వంశీ, ప్ర‌మోద్‌, విక్ర‌మ్ నిర్మిస్తున్నారు. విశ్వంభ‌ర కోసం భారీ బ‌డ్జెట్‌తో 13 సెట్స్‌ను సినిమా యూనిట్ తీర్చిదిద్దింది. ఈ సెట్స్‌లోనే విశ్వంభ‌ర సినిమాను చాలా వ‌ర‌కు తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

విశ్వంభ‌ర సినిమాకు కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప‌నిచేస్తోంది. విశ్వంభ‌ర త‌ర్వాత క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ మూవీని సుస్మిత కొణిదెల నిర్మించ‌నుంది. గ‌త ఏడాది చిరంజీవి హీరోగా న‌టించిన వాల్తేర్ వీర‌య్య‌, భోళా శంక‌ర్ రిలీజ‌య్యాయి. ఇందులో వాల్తేర్ వీర‌య్య బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిల‌వ‌గా భోళాశంక‌ర్ మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

IPL_Entry_Point

టాపిక్