Prashanth Neel | టాలీవుడ్ లో ప్ర‌శాంత్ నీల్ కు ఫుల్ డిమాండ్‌-tollywood stars wish to work with kgf director prashanth neel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prashanth Neel | టాలీవుడ్ లో ప్ర‌శాంత్ నీల్ కు ఫుల్ డిమాండ్‌

Prashanth Neel | టాలీవుడ్ లో ప్ర‌శాంత్ నీల్ కు ఫుల్ డిమాండ్‌

Nelki Naresh HT Telugu
Apr 21, 2022 02:15 PM IST

కేజీఎఫ్‌-2 చిత్రం బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ అద్వితీయ వ‌సూళ్ల‌తో దూసుకుపోతున్న‌ది. ఈ భారీ స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్‌తో ప‌నిచేయాల‌ని టాలీవుడ్ స్టార్ హీరోలు అంద‌రూ ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే అత‌డికి ప‌లువురు టాలీవుడ్ నిర్మాత‌లు పెద్ద మొత్తాల్లో అడ్వాన్సులు ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌శాంత్ నీల్
ప్ర‌శాంత్ నీల్ (twitter)

 కేజీఎఫ్ సిరీస్ సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ పేరు దేశ‌వ్యాప్తంగా మారుమోగుతోంది. హీరోయిజాన్ని ప‌తాక స్థాయిలో ఆవిష్క‌రించి  క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కొత్త అర్థాన్ని చాటిచెప్పారు. కేజీఎఫ్ -2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లోనే ఏడు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి రికార్డుల‌ను సృష్టిస్తోంది. క‌న్న‌డంతో పాటు తెలుగు, హిందీ భాష‌ల్లోనూ చక్కటి ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకున్న‌ది. కేజీఎఫ్ సీక్వెల్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ తో సినిమా చేయాల‌ని ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆస‌క్తిని చూపుతున్నారు. 

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో స‌లార్ సినిమా చేస్తున్నారు ప్ర‌శాంత్ నీల్‌, గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశంతో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా  షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. పాన్ ఇండియ‌న్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. స‌లార్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ మ‌ళ్లీ టాలీవుడ్ స్టార్‌తోనే సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ కమిట్ మెంట్ ఉంది.  గ‌త‌ ఏడాది ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్న‌ది. అల్లు అర్జున్ తో ప్ర‌శాంత్ నీల్  ఓ సినిమా చేయాల్సివుంది.  

కేజీఎఫ్‌-1 రిలీజ్ గీతా ఆర్ట్స్ సంస్థ ప్ర‌శాంత్ నీల్ కు అడ్వాన్సులు ఇచ్చేసింది.  ప్ర‌శాంత్ నీల్ పిలుపు కోసం వారు ఎదురుచూస్తున్నారు. నాలుగైదు నెల‌ల క్రితం చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌ను ప్ర‌శాంత్ నీల్ క‌లిసిన ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ప్ర‌శాంత్ నీల్‌తో సినిమా చేయాల‌నే ఇంట్రెస్ట్ తో రామ్ చ‌ర‌ణ్ ఉన్న‌ట్లు స‌మాచారం. 

మ‌రోవైపు కేజీఎఫ్‌-2 రిలీజ్ త‌ర్వాత త‌న‌కు తొలి ప్ర‌శంస మ‌హేష్ బాబు నుంచే వ‌చ్చింద‌ని ఇటీవ‌లే ప్ర‌శాంత్ నీల్ చెప్పాడు. మ‌హేష్ ఫోన్ చేసి అభినందించాడ‌ని చెప్పాడు. మహేష్ బాబు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.  ప్ర‌శాంత్ నీల్ ను లైన్ లో పెట్టాల‌ని టాలీవుడ్ స్టార్స్ అంద‌రు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి ప్ర‌శాంత్ నీల్ ఏ హీరోకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడో వేచిచూడాల్సిందే..

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్