Tillu Square first song: ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. మాస్‍ బీట్‍తో.. సిద్ధు, అనుపమ రొమాన్స్!-tillu square first lyrical song ticket eh konakuda released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tillu Square First Song: ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. మాస్‍ బీట్‍తో.. సిద్ధు, అనుపమ రొమాన్స్!

Tillu Square first song: ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. మాస్‍ బీట్‍తో.. సిద్ధు, అనుపమ రొమాన్స్!

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 26, 2023 04:07 PM IST

Tillu Square first song: ‘టిల్లు స్క్వేర్’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. మంచి మాస్ బీట్‍తో అదిరిపోయేలా ఈ పాట ఉంది.

Tillu Square first song: ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
Tillu Square first song: ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

Tillu Square first song: యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‍లో వస్తున్న ‘టిల్లు స్క్వేర్’ మూవీపై మంచి క్రేజ్ ఉంది. గతేడాది ‘డీజే టిల్లు’తో సిద్ధు సెన్సేషనల్ హిట్ సాధించగా.. దానికి సీక్వెల్‍గా ఈ ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, టిల్లు స్క్వేర్ మూవీ నుంచి నేడు (జూలై 26) తొలి పాట వచ్చేసింది. ‘టికెట్టే కొనకుండా’ అనే తొలి లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఎలా ఉందంటే..

టిల్లు స్క్వేర్ నుంచి వచ్చిన ఈ ‘టికెట్టే కొనకుండా’ సాంగ్‍కు రామ్ మిర్యాల స్వరాలు సమకూర్చారు. పాట కూడా ఆయనే పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. “టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా” అంటూ ఈ పాట మొదలైంది. మాస్ బీట్‍తో ఆకట్టుకునేలా ఉంది. ప్రేమలో పడి మళ్లీ మునిగిపోతావనేలా సిద్ధును హెచ్చరిస్తున్నట్టుగా ఈ సాంగ్ సాగుతుంది. సిద్ధు, అనుపమ పరమేశ్వన్ మధ్య రొమాటింగ్ సీన్లు కూడా ఈ పాటలో ఉన్నాయి. సిద్ధు డ్యాన్స్ మరో హైలైట్‍గా ఉండేలా కనిపిస్తోంది. టిల్లు స్క్వేర్ చిత్రానికి శ్రీచరణ్ పాకాల కూడా మరో సంగీత దర్శకుడిగా ఉన్నారు.

గతేడాది వచ్చిన డీజే టిల్లు సినిమాలో ‘టిల్లు అన్న డీజే పెడితే’ అనే టైటిల్ సాంగ్‍ను కూడా రామ్ మిర్యాల స్వరపరిచి, స్వయంగా పడారు. కాసర్ల శ్యామ్ రిలిక్స్ రాశారు. ఆ పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాస్ బీట్‍తో అదరగొట్టింది. చాలా పాపులర్ అయింది. డీజే టిల్లు సినిమాకు ఫుల్ క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు.. మళ్లీ రామ్ మిర్యాల, కాసర్ల శ్యామ్ కాంబినేషన్‍తోనే టిల్లు స్క్వేర్ సినిమాలో ఫస్ట్ పాట ‘టికెట్టే కొనకుండా’ వచ్చేసింది. అనుపమను సిద్ధు ఫ్లర్ట్ చేస్తున్నట్టు ప్రోమోను రిలీజ్ చేసి.. ఈ పాటకు ముందే మంచి బజ్ తీసుకొచ్చింది చిత్ర యూనిట్. ఈ లిరికల్ సాంగ్‍ మొదట్లో.. ఆ ఫ్లర్టింగ్ ప్రోమోను కూడా చిత్ర యూనిట్ ఉంచింది. 

టిల్లు స్క్వేర్ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్ల నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సాయి ప్రకాశ్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.

IPL_Entry_Point