Bigg Boss 6 Contestants: బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్లు వీళ్లే!
Bigg Boss 6 Contestants: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 త్వరలోనే రానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ రియాల్టీ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఓ బజ్ క్రియేట్ అయింది.
బిగ్‌బాస్.. ఏ భాషలో లాంచ్ అయినా సూపర్ హిట్ టాక్ కొట్టేసిందీ రియాల్టీ షో. తెలుగులోనూ ఐదు సీజన్ల పాటు సక్సెస్‌ఫుల్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆరో సీజన్‌కు సిద్ధమవుతోంది. త్వరలోనే ఇది ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కొన్ని రోజుల కిందటే ఆర్గనైజర్లు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈసారి కూడా షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.
అయితే తాజాగా ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్లు వీళ్లేనంటూ వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రతిసారీ కాస్త కాంట్రవర్షియల్ కంటెస్టెంట్లనే బిగ్‌బాస్‌కు సెలక్ట్ చేస్తారు. ఈసారి కూడా అలాంటి వాళ్ల కోసం వేట సాగుతోంది. అయితే ప్రస్తుతానికి కొందరి పేర్లు మాత్రం తెరమీదికి వచ్చాయి. వీళ్లలో ఒకప్పుడు బుల్లితెరను ఏలిన యాంకర్ ఉదయభాను కూడా ఉంది.
ఆమెతోపాటు యాంకర్ నిఖిల్, శ్రీహాన్, యాంకర్ నేహా చౌదరీ, యూట్యూబర్ ఆది రెడ్డి, గీతు రాయల్, జబర్దస్త్ అప్పారావుల పేర్లు ఫైనల్ అయినట్లు సమాచారం. వీళ్లతోపాటు మరికొందరు పేర్లు కూడా ఫైనల్ కాగా.. ఇంకొందరు కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ల కోసం ఆర్గనైజర్లు చూస్తున్నారు. ఈసారి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లనున్నారు.
బిగ్‌బాస్ 5లో విజేతగా వీజే సన్నీ నిలిచిన విషయం తెలిసిందే. అప్పుడు 18 మంది ఇతర కంటెస్టెంట్లతో కలిసి హౌజ్‌లోకి వెళ్లిన సన్నీ.. చివరికి టైటిల్ గెలిచాడు. అంతేకాదు కిందటిసారి బిగ్‌బాస్ ఓటీటీ పేరుతో హాట్‌స్టార్‌లో 24 గంటలపాటు ఈ షో టెలికాస్ట్ అయిన విషయం కూడా తెలిసిందే. ఈ బిగ్‌బాస్ తెలుగు షో తొలి సీజన్‌లో జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత నాని హోస్ట్‌గా చేయగా.. మూడో సీజన్ నుంచి నాగార్జున ఒంటిచేత్తో షోను నడిపిస్తున్నాడు.