Jr NTR with Lakshmi Pranathi: పచ్చని చెట్ల మధ్య భార్యతో జూనియర్ ఎన్టీఆర్.. ఫొటో వైరల్
Jr NTR with Lakshmi Pranathi: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు చెందిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోని సోమవారం (ఆగస్ట్ 1) తారకే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ సక్సెస్‌ను ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీలో కొమురం భీమ్ పాత్రలో అదరగొట్టిన తారక్‌కు ఇంటర్నేషనల్ లెవల్లో ప్రశంసలు దక్కాయి. ఆ మూవీ రిలీజ్ అయి, సూపర్ హిట్ అయిన తర్వాత జూనియర్ మరో మూవీని ఇంకా మొదలుపెట్టలేదు. అయితే ప్రస్తుతం భార్య లక్ష్మి ప్రణతితో కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తున్నాడు.
దీనికి సంబంధించి సోమవారం (ఆగస్ట్ 1) అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేశాడు. అందులో పచ్చని చెట్ల మధ్య భార్య లక్ష్మి ప్రణతితో కలిసి ఉన్న తారక్‌ను చూడొచ్చు. ఇద్దరూ కాఫీ తాగుతూ ముచ్చట్లలో మునిగి తేలారు. ఇలాంటి క్షణాలే కదా కావాల్సింది అన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ ఈ ఫొటోకు క్యాప్షన్ ఉంచాడు. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన నిమిషాల్లోనే ఈ ఫొటో వైరల్ అయింది.
గంటలోపే సుమారు 3 లక్షల లైక్స్ రావడం విశేషం. కొన్ని వందల మంది కామెంట్స్ చేయగా.. అందులో చాలా మంది హార్ట్, ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు 45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నిజానికి సోషల్ మీడియాలో తారక్ అంత యాక్టివ్‌గా కనిపించడు. ఇన్‌స్టాలోనూ చాలా రోజుల తర్వాత అతడు ఈ ఫొటో పోస్ట్ చేశాడు.
అంతకుముందు ఎప్పుడో మే 20న ఓ పోస్ట్ ఉండగా.. ఇప్పుడు రెండు నెలల తర్వాత మళ్లీ భార్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు కొరటాల శివతో అతడు మరో మూవీ చేస్తున్నాడు. దీన్ని ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30గా పిలుస్తున్నారు.