Nagarjuna: నాగార్జునతో సినిమాను కన్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 డైరెక్టర్ - కానీ కండీషన్స్ అప్లై
కార్తికేయ-2 (Krathikeya 2)తర్వాత తన తదుపరి సినిమా ఏమిటన్నది రివీల్ చేశాడు దర్శకుడు చందూ మొండేటి. అక్కినేని హీరోతో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించాడు.
నిఖిల్ (Nikhil) హీరోగా చందూ మొండేటి (Chandoo mondeti) దర్శకత్వంలో రూపొందుతున్న కార్తికేయ-2 చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. 2014లో రూపొందిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సూపర్ నాచురల్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు చందూ మొండేటి ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. కాగా అనేక అడ్డంకులను దాటుకొని రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి డిఫరెంట్‌గా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది.
ఈ ప్రమోషన్స్‌తో నిఖిల్, దర్శకుడు చందూ మొండేటి బిజీగా ఉన్నారు. వీరిద్దరు కలిసి ఆలీతో సరదాగాషోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జు(Nagarjuna)నతో సినిమా గురించి చందూ మొండేటిని ఆలీ ప్రశ్న అడిగారు. నాగార్జునతో తప్పకుండా సినిమా చేస్తానని ఆలీ ప్రశ్నకు చందూ మొండేటి సమాధానం ఇచ్చాడు. ఓ పోలీస్ కథకు సంబంధించి నాగార్జునతో డిస్కషన్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కార్తికేయ-2 అనుకున్నట్లుగా ఆడితేనే నాగార్జున సినిమా మొదలవుతుందని పేర్కొన్నాడు. అక్కినేని హీరో నాగచైతన్యతో చందూ మొండేటి ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు చేశాడు. అందులో ప్రేమమ్ హిట్ టాక్ సొంతం చేసుకోగా సవ్యసాచి మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. వాటి ఫలితంతో సంబంధం లేకుండా చందూ మొండేటి తో సినిమా చేయడానికి నాగార్జున అంగీకరించినట్లు సమాచారం. కాగా కార్తికేయ 2 సినిమాను నాలుగేళ్ల క్రితం అనౌన్స్ చేశారు.
కొవిడ్ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. గత నెలలో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా నాగచైతన్య థాంక్యూ కారణంగా మరోసారి వాయిదాపడింది. చైతన్య సినిమా కోసం కార్తికేయ 2 రిలీజ్ ను పోస్ట్‌పోన్ చేయడం విమర్శలకు దారితీసింది. ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.