Nani: నాని దసరా గ్యాంగ్ ఇదే - ఫ్రెండ్‌షిప్ డే స్సెషల్ పోస్టర్ రిలీజ్
ఫ్రెండ్‌షిప్‌డేను పురస్కరించుకొని దసరా (Dasara Movie) సినిమాలోని స్పెషల్ పోస్టర్‌ను హీరో నాని (Nani)ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్‌ను ఉద్దేశించి నాని ఏమన్నాడంటే...
Nani Dasara Movie Friendship Day Poster: దసరా సినిమాతో కెరీర్‌లో తొలిసారి కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు హీరో నాని. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఇందులో మాస్ క్యారెక్టర్‌లో నాని కనిపించబోతున్నారు. ఆదివారం ఫ్రెండ్‌షిప్‌ను డేను పురస్కరించుకొని ఈ సినిమాలోని కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తన ఫ్రెండ్స్‌తో కలిసి నాని ఆనందంగా కనిపిస్తున్నారు. ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగ మరగ చేద్దాం అంటూ ఈ పోస్టర్‌ను ఉద్దేశించి నాని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో నాని చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. దసరా సినిమా కోసం తెలంగాణ యాసను నేర్చుకొని నటిస్తున్నాడు నాని. గోదావరిఖని సింగరేని కోల్‌మైన్స్ సమీపంలోని ఓ విలేజ్ నేపథ్యంలో ఫిక్షనల్ స్టోరీగా దసరా సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ తుదిశకు చేరుకున్నది. ఇందులో నాని సరసన కీర్తిసురేష్ (Keerthy suresh) హీరోయిన్‌గా నటిస్తోంది.
ఎమ్‌సీఏ తర్వాత వీరిద్దరి నాని,కీర్తిసురేష్ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. సాయికుమార్,సముద్రఖని కీలక పాత్రలను పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం,కన్నడం,మలయాళం,హిందీలో ఈసినిమా రిలీజ్‌కానుంది.
టాపిక్