45 కోట్ల బడ్జెట్ సినిమాకు 80 వేల కలెక్షన్స్.. ఘోరమైన డిజాస్టర్‌గా రికార్డ్.. దెబ్బకొట్టిన ఆ స్ట్రాటజీ-the lady killer total worldwide collection arjun kapoor bhumi pednekar movie disaster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  The Lady Killer Total Worldwide Collection Arjun Kapoor Bhumi Pednekar Movie Disaster

45 కోట్ల బడ్జెట్ సినిమాకు 80 వేల కలెక్షన్స్.. ఘోరమైన డిజాస్టర్‌గా రికార్డ్.. దెబ్బకొట్టిన ఆ స్ట్రాటజీ

Sanjiv Kumar HT Telugu
Nov 29, 2023 12:33 PM IST

The Lady Killer Collection: బాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా అరోరా బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ నటించిన ది లేడి కిల్లర్ సినిమాకు దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ది లేడి కిల్లర్ మూవీ హిందీ బాక్సాఫీస్ చరిత్రలోనే ఘోరమైన డిజాస్టర్ చిత్రంగా రికార్డుకెక్కింది.

45 కోట్ల బడ్జెట్ సినిమాకు 80 వేల కలెక్షన్స్.. ఘోరమైన డిజాస్టర్‌గా రికార్డ్.. దెబ్బకొట్టిన ఆ స్ట్రాటజీ
45 కోట్ల బడ్జెట్ సినిమాకు 80 వేల కలెక్షన్స్.. ఘోరమైన డిజాస్టర్‌గా రికార్డ్.. దెబ్బకొట్టిన ఆ స్ట్రాటజీ

The Lady Killer Budget And Collection: కోట్లల్లో బడ్జెట్ పెట్టి సినిమాలు చిత్రీకరిస్తుంటారు దర్శకనిర్మాతలు. అంతకుమించిన లాభాలు వస్తాయన్న ఆశతో బాక్సాఫీస్ బరిలోకి దించుతారు. కానీ, వాటికి ఊహించనివిధంగా కలెక్షన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఎక్స్‌పెక్ట్ చేయలేనంత లాభాలు తెచ్చిపెడితే.. ఇంకొన్నిసార్లు తట్టుకోలేని నష్టాలు తీసుకొస్తాయి. అలా తాజాగా ఓ సినిమా రికార్డుకెక్కింది.

45 కోట్ల బడ్జెట్

బాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా అరోరా బాయ్‌ఫ్రెండ్, యంగ్ హీరో అర్జున్ కపూర్, గ్లామర్ బ్యూటి భూమి పెడ్నేకర్ మెయిన్ లీడ్ రోల్ చేసిన సినిమా ది లేడి కిల్లర్. సెక్షన్ 375 మూవీ డైరెక్టర్ అజయ్ బెహల్ దర్శకత్వం వహించిన ది లేడి కిల్లర్ సినిమాను శైలేష్ సింగ్, సాహిల్ మీర్ చందానీ నిర్మించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషన్స్ అన్ని ఖర్చులతో ది లేడి కిల్లర్ సినిమాకు సుమారు రూ. 45 కోట్ల బడ్జెట్ అయింది. అయితే, ఎన్నో అంచనాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమాకు ఊహించని కలెక్షన్స్ వచ్చాయి.

దారుణమైన డిజాస్టర్

నవంబర్ 3న థియేటర్లలో విడుదలైన ది లేడి కిల్లర్ సినిమాకు మొత్తంగా రూ. 85 వేలు మాత్రమే కలెక్ట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో హిందీ చిత్రపరిశ్రమలోనే అత్యంత తక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ది లేడి కిల్లర్ పేరు సంపాదించింది. అంతేకాకుండా దారుణమైన డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది ది లేడి కిల్లర్ మూవీ.

చేతులు ఎత్తేసిన నిర్మాతలు

ది లేడి కిల్లర్ సినిమా అంత డిజాస్టర్ కావడానికి కారణాలు మూవీ మేకింగ్‌లో చేసిన పొరపాట్లు అని బాలీవుడ్ వెబ్‌సైట్స్ పేర్కొన్నాయి. మూవీ పూర్తి చేసేందుకు ఇంకో పది రోజుల ఔట్ డోర్ షూటింగ్ ఉందట. కానీ, అప్పటికే సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోవడంతో అంతకుమించి పెట్టలేమని నిర్మాతలు చేతులు ఎత్తేశారట. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో లాక్ చేసిన డేట్‌కి రిలీజ్ కావాలి.

దెబ్బ కొట్టిన స్ట్రాటజీ

అలాగే, ఫైనాన్స్‌లో తీసుకున్న డబ్బును కవర్ చేసేందుకు అర్జంట్‌గా సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రొడ్యూసర్ అండ్ టీమ్ ఒక స్ట్రాటజీ అమలు చేశారు. మిగిలిపోయిన పోర్షన్స్‌కి ఎడిటింగ్ టెక్నిక్స్ ఉపయోగించి.. సినిమా మధ్యలో ఉన్న గ్యాప్స్ ఫిల్ చేసేందుకు సీన్లకు బదులు వాయిస్ ఓవర్ ఇచ్చి కంప్లీట్ మూవీ ఫీల్ వచ్చేలా సెటప్ చేశారు.

500 మాత్రమే

అలా నార్త్‌లో 50 థియేటర్లలో ది లేడి కిల్లర్ సినిమాను విడుదల చేశారు. పాజిటివ్ టాక్ వస్తే మరిన్ని థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ, అస్సలు వర్కౌట్ కాలేదు. దీంతో ఆ సినిమా మొత్తంగా 500కుపైగా టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇలా మేకర్స్ అతి తెలివిగా వాడిన ఎడిటింగ్ టెక్నిక్ స్ట్రాటజీ అట్టర్ ప్లాప్ తెచ్చి పెట్టింది.

IPL_Entry_Point