Keeda Cola Teaser: “ఎలా బతికావ్ రా ఇన్నాళ్లు నువ్వు!” కీడా కోలా టీజర్ వచ్చేసింది.. తరుణ్ భాస్కర్ మార్క్-tharun bhascker keeda cola teaser out check details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Keeda Cola Teaser: “ఎలా బతికావ్ రా ఇన్నాళ్లు నువ్వు!” కీడా కోలా టీజర్ వచ్చేసింది.. తరుణ్ భాస్కర్ మార్క్

Keeda Cola Teaser: “ఎలా బతికావ్ రా ఇన్నాళ్లు నువ్వు!” కీడా కోలా టీజర్ వచ్చేసింది.. తరుణ్ భాస్కర్ మార్క్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 28, 2023 02:20 PM IST

Keeda Cola Teaser: కీడా కోలా సినిమా టీజర్ రిలీజ్ అయింది. తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. బ్రహ్మానందం కీలక పాత్ర పోషించాడు.

కీడా కోలా టీజర్ వచ్చేసింది
కీడా కోలా టీజర్ వచ్చేసింది

Keeda Cola Teaser: క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న ‘కీడా కోలా’ సినిమా టీజర్ వచ్చేసింది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాల తర్వాత తరుణ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. దాదాపు ఐదేళ్ల తర్వాత అతడు మళ్లీ మెగాఫోన్ పట్టాడు. కీడా కోలా చిత్రంలో ‘హాస్య బ్రహ్మ’ బ్రహ్మానందం కీలకపాత్ర పోషిస్తున్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా డిఫరెంట్ కథాంశంతో కీడా కోలా రూపొందుతోంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను నేడు (జూన్ 28) చిత్ర యూనిట్ విడుదల చేసింది. కీడా కోలా టీజర్ ఆసక్తికరంగా సాగింది.

ముందుగా కీడా కోలా అనే పేరున్న కూల్‍డ్రింక్ బాటిల్.. కీడా కోలా టీజర్‌లో కనిపిస్తుంది. ఆ తర్వాత సీనియర్ నటుడు బ్రహ్మానందం, చైతన్య రావు కనిపిస్తారు. “ఏంట్రా అది” అని బ్రహ్మానందం అంటే.. ‘గ్రేప్స్ ఏమో’ అని అంటాడు చైతన్య. “గ్రేప్సా.. ఎలా బతికావురా ఇన్నాళ్లు నువ్వు” అని బ్రహ్మానందం డైలాగ్ చెబుతాడు. “నువ్వు.. నువ్వు బతుకుతలేవా.. అట్లనే” అంటాడు చైతన్య. ఆ తర్వాత కీడా కోలా కోసం స్టోరీ తిరుగుతుందనేలా విజువల్స్ ఉన్నాయి. గన్స్‌తో యాక్షన్ సీన్లు ఉన్నాయి. మరికొన్ని పాత్రలను తరుణ్ భాస్కర్ ఈ టీజర్‌లో చూపించాడు. ఈ మూవీలో తరుణ్ భాస్కర్ కూడా స్వయంగా నటిస్తున్నాడు. అతడు నెగెటివ్ క్యారెక్టర్ పోషించినట్టు కనిపిస్తోంది. “శ్వాస మీద ధ్వాస.. ఒస్తున్నాం” అంటూ ఈ టీజర్ ముగిసింది. టీజర్ మొత్తం తరుణ్ భాస్కర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది

కీడా కోలా టీజర్ బ్యాక్‍‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా వెరైటీగా ఉంది. ఈ టీజర్‌ను తరుణ్ భాస్కర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. “కష్టపడ్డాం. పాలమ్మినం. ఇగ అంతా మీదే. తీసుకోండి. ఫైర్ లేపాలి” అని తరుణ్ పోస్ట్ చేశాడు. ఈ చిత్రానికి కూడా వివేక్ సాగర్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు తరుణ్.

కీడా కోలా మూవీలో బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు చేశారు. వివేక్ సుదాన్షు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ సంవత్సరమే ఈ చిత్రం విడుదల కానుంది.

కాగా, తరుణ్ భాస్కర్ డైరెక్షన్‍లో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమా రేపు (జూన్ 29) థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. రిలీజై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీ మరోసారి థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే ఈ మూవీ టికెట్లు జోరుగా బుక్ అవుతున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం