Thandel movie launch: నాగచైతన్య నయా మూవీ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. డేట్, టైమ్ ఇవే-thandel movie official launch on december 9 naga chaitanya sai pallavi to play in lead roles ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thandel Movie Launch: నాగచైతన్య నయా మూవీ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. డేట్, టైమ్ ఇవే

Thandel movie launch: నాగచైతన్య నయా మూవీ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. డేట్, టైమ్ ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 08, 2023 08:10 PM IST

Thandel movie launch: తండేల్ సినిమా ప్రారంభానికి డేట్, టైమ్ ఫిక్స్ అయ్యాయి. నాగ చైతన్య, సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించనున్నారు.

Thandel movie launch: నాగచైతన్య నయా మూవీ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. డేట్, టైమ్ ఇవే
Thandel movie launch: నాగచైతన్య నయా మూవీ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. డేట్, టైమ్ ఇవే

Thandel movie launch: యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా నటించనున్న ‘తండేల్’ మూవీపై చాలా ఆసక్తి ఉంది. ఈ చిత్రంలో మత్య్సకారుడిగా ఆయన నటించనున్నారు. ఫస్ట లుక్‍తోనే ఈ చిత్రానికి ఫుల్ హైప్ వచ్చింది. చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న తండేల్ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‍ పాత్ర పోషించనున్నారు. లవ్ స్టోరీ తర్వాత చైతూ - సాయి పల్లవి రెండోసారి కలిసి నటిస్తున్నారు. మొత్తంగా తండేల్ మూవీపై అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. కాగా, ఈ మూవీ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.

తండేల్ సినిమా ముహూర్తం కార్యక్రమం రేపు (డిసెంబర్ 9) ఉదయం 10 గంటల 30 నిమిషాలకు జరగనుంది. హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్‍లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ లాంచ్ కార్యక్రమంతో తండేల్ సినిమా అధికారికంగా ప్రారంభం కానుంది.

తండేల్ మూవీ ముహూర్తం కార్యక్రమానికి సీనియర్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య తండ్రి కింగ్ నాగార్జున అతిథులుగా రానున్నారు.

“అడ్వెంచరస్ ప్రయాణానికి అంతా సిద్ధం. అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్‍లో డిసెంబర్ 9వ తేదీ ఉదయం 10.30 గంటలకు తండేల్ మూవీ ముహూర్తం కార్యక్రమం. విక్టరీ వెంకటేశ్, కింగ్ నాగార్జున ఈ కార్యక్రమానికి వచ్చి.. టీమ్‍ను ఆశీర్వదించనున్నారు” అని గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది.

‘కార్తికేయ 2’ మూవీతో మంచి ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు చందూ మొండేటి.. తండేల్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. నాగ చైతన్యకు ఇది 23వ మూవీగా ఉంది. సాయి పల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. గీతాఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

2018లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్‍కు వెళ్లారు. పాకిస్థాన్ దళాలు వారిని పట్టుకొని బంధించాయి. వారు పాకిస్థాన్‍లోని జైలులో ఉండగా.. విడిపించేందుకు భారత ప్రభుత్వం కృషి చేసింది. పాక్‍తో చర్చలు జరిపింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పాకిస్థాన్ ఆ జాలర్లను విడుదల చేసింది. ఈ యథార్థ ఘటనల ఆధారంగానే తండేల్ మూవీ రూపొందనుంది. మత్స్యకారుడిగా నాగ చైతన్య నటించనున్నారు. తండేల్ అంటే నాయకుడు, బోట్‍కు కెప్టెన్ అనే అర్థం కూడా వస్తుందని ఇటీవలే డైరెక్టర్ స్పష్టత ఇచ్చారు.

సంబంధిత కథనం